Beast First Day Collections: టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. మరి, రాజు గారికి ఎంత లాభం ? ఎంత నష్టం ? లెక్కల వైజ్ గా చూద్దాం.
నిజానికి ‘బీస్ట్’ పై భారీ అంచనాలున్నాయి. అందుకే, తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరిగింది ? ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. అలాగే ఈ సినిమా ఎంత నష్ట పోతుందో కూడా తెలుసుకుందాం.
Also Read: CM Kcr On Paddy: ధాన్యం దంగల్‌లో గెలిచి ఓడిన కేసీఆర్!
నైజాంలో బీస్ట్ కి 3.30 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 60 లక్షలు కలెక్ట్ చేసింది.
సీడెడ్ లో బీస్ట్ కి 2.00 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 30 లక్షలు కలెక్ట్ చేసింది.
ఉత్తరాంధ్ర లో బీస్ట్ కి 1.80 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 21 లక్షలు కలెక్ట్ చేసింది.
ఈస్ట్ లో బీస్ట్ కి 0.75 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 18 లక్షలు కలెక్ట్ చేసింది.
వెస్ట్ లో బీస్ట్ కి 0.70 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 15 లక్షలు కలెక్ట్ చేసింది.
గుంటూరులో బీస్ట్ కి 0.88 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 25 లక్షలు కలెక్ట్ చేసింది.
కృష్ణాలో బీస్ట్ కి 0.80 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 23 లక్షలు కలెక్ట్ చేసింది.
నెల్లూరులో బీస్ట్ కి 0.45 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే 14 లక్షలు కలెక్ట్ చేసింది.
ఏపీ + తెలంగాణ మొత్తం కలిపి బీస్ట్ కి 10.68 కోట్లు బిజినెస్ జరగగా ఫస్ట్ డే కోటి 2 కోట్లు 11 లక్షలు కలెక్ట్ చేసింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ, బీస్ట్ కి ప్లాప్ టాక్ వచ్చింది. పైగా రేపు ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ కి రెడీగా ఉంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా.. బీస్ట్ థియేటర్స్ లో నిలబడటం కష్టమే. మొత్తానికి ఈ సినిమాతో దిల్ రాజుకి దాదాపు 8 కోట్లు మేరకు నష్టం వచ్చింది.
Also Read:Bheemla Nayak Closing Collections: భీమ్లా నాయక్ క్లోసింగ్ కలెక్షన్స్