Career Growth Tips: ఉద్యోగం, వ్యాపారం భిన్న పరిస్థితులు ఉంటాయి. వ్యాపారం చేసేవారు ముందుగా చిన్న స్థాయిలో ప్రారంభం చేసి.. ఆ తర్వాత మళ్లీ మెల్లిగా పెద్ద స్థాయికి ఎదిగిపోతారు. ఈ క్రమంలో ఒక వ్యాపారస్తుడు తన సొంత వ్యాపారం కాబట్టి అందుకోసం నిరంతరం కష్టపడుతూ ఉంటాడు. ఉదయం పగలు అని తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటాడు. దీంతో అతడు ఎప్పటికైనా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగులు మాత్రం కేవలం జీతం కోసం మాత్రమే పనిచేస్తారు. అయితే జీతం కోసం పని చేసే వ్యక్తులు… భవిష్యత్తులో జీతం మాత్రమే తీసుకుంటారు. అలాకాకుండా ఈ విధంగా పనిచేస్తే వారు ఆ సంస్థకు అధిపతులు కూడా కావచ్చు. అలా కావాలంటే ఎలాంటి పనులు చేయాలి?
Also Read: ఉదయం లేవగానే ఈ పనులను అస్సలు చేయొద్దు..
ఒక ప్రాజెక్టు కంపెనీ, లేదా సంస్థకు వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక ఉద్యోగి తనకు సంబంధించిన పరిధి వరకు మాత్రమే పనిచేస్తే అతను అలాగే ఉండిపోతాడు. కానీ తాను onup చేసుకొని పనిచేయడం వల్ల తనతో పాటు సంస్థకు కూడా పేరు వస్తుంది. జీతం తీసుకునే ఉద్యోగి కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పనిచేస్తాడు. అలా కాకుండా నిత్యం ఆ సంస్థ కోసమే పని చేసే వ్యక్తి.. తన సంస్థగా భావించి పనిచేసే వ్యక్తికి ఎప్పటికైనా తనతోపాటు సంస్థ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
సుందర్ పిచాయ్, సత్యం నాదెళ్ల వంటి వారు కేవలం ఉద్యోగులు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ వారు మిగతా వాళ్ళలాగా ఉద్యోగం చేస్తే వారు ఒక కంపెనీలకు సీఈవోలు కాలేకపోయేవారు. వారు ఇలా కావడానికి ఎంతో కృషిచేసి ముందుకు వచ్చారు. మిగతా వారిలా కాకుండా ఎక్కువగా కష్టపడుతూ.. సంస్థ కోసం ఎన్నో రకాలుగా త్యాగాలు చేసిన వారు ఈ స్థితికి వచ్చారు. వారితోపాటు సంస్థ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
అలా ప్రతి ఉద్యోగి సంస్థ కోసం నిరంతరం కష్టపడడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందుతారు. అయితే చాలామంది తాము ఎంత కష్టపడినా తమకు ప్రాధాన్యత లేదని అంటూ ఉంటారు. ప్రాధాన్యం లేదా గుర్తింపు అనేది ఎప్పుడూ ఒకచోట వస్తుంది. ఒక సంస్థలో ఎక్కువగా కష్టపడినప్పుడు గుర్తింపు రాకపోతే.. ఇదే నైపుణ్యాన్ని ఇతర సంస్థలో కూడా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు ఆ సంస్థలో కచ్చితంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిభను ఒకరు కాకుండా మరొకరు గుర్తించే అవకాశం ఉంటుంది. అలా తమ ప్రతిభను వృధా చేయకుండా సంస్థ లేదా కంపెనీ కోసం ఉపయోగించాలి.
Also Read: మార్నింగ్ వాక్ మంచిదా? ఈవెనింగ్ వాక్ మంచిదా?
ప్రతి ఒక్క ఉద్యోగి తన కంపెనీ అనుకొని పనిచేయడం వల్ల ఎప్పటికైనా విజయం తప్పకుండా సాధిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. అలాగే ఉద్యోగి కూడా పని చేస్తే తనతో మరికొందరిని కూడా అభివృద్ధి చెందించే అవకాశం ఉంటుంది.