Coolie Sathyaraj Monica Dance: అనిరుద్(Anirudh Ravichander) సంగీతం అంటే నేటి తరం యూత్ ఆడియన్స్ చెవులు కోసేసుకుంటారు. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అనేది కూడా పట్టించుకోరు. ఆయన నుండి ఒక పాట వచ్చిందంటే ఎగబడి వింటారు, చూస్తారు, మిలియన్ల కొద్దీ వ్యూస్ ని అందిస్తూ ఉంటారు. ఒక సన్నివేశాన్ని తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చెయ్యాలన్నా, ఎంత పెద్ద సూపర్ స్టార్ ని అయినా తన మ్యూజిక్ తో డామినేట్ చెయ్యాలన్నా, కేవలం అనిరుద్ కి మాత్రమే సాధ్యం. అలాంటి అనిరుద్ మ్యూజిక్ ని డామినేట్ చేసిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే, అది సౌబిన్ సాహిర్ మాత్రమే అని చెప్పొచ్చు. రీసెంట్ గా కూలీ(Coolie Movie) చిత్రం నుండి విడుదలైన ‘మౌనికా'(Mounica Bellucci Song) పాట ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము. ఈ పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం అనిరుద్ కాదు, సౌబిన్ సాహిర్.
Also Read: ఆగిన పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’ షూటింగ్.. దెబ్బకు దిగొచ్చిన నిర్మాతలు…
ఆయన వేసిన స్టెప్పులు , తనతో కలిసి స్క్రీన్ ని పంచుకున్న పూజా హెగ్డే ని డామినేట్ చేశాయి, అదే విధంగా అనిరుద్ మ్యూజిక్ ని కూడా డామినేట్ చేసింది. కేవలం ఆయన స్టెప్పులను రిపీట్ లో చూడడం కోసమే ఈ పాటని యూట్యూబ్ లో నెటిజెన్స్ పదే పదే చూస్తున్నారు. తమిళ వెర్షన్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 55 మిలియన్ వ్యూస్ రాగా, తెలుగు లో 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నేడు తెలుగు లో జరిగిన కూలీ ప్రెస్ మీట్ లో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యరాజ్ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఆయన మౌనికా పాటకు వేసిన స్టెప్పులను చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాకు అద్భుతమైన క్యారక్టర్ ని ఇచ్చినందుకు లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కి ధన్యవాదాలు’.
Also Read: ‘కూలీ’ లో ఎవ్వరూ ఊహించని సప్రైజ్ ఎలిమెంట్స్..ఫ్యాన్స్ ఏమైపోతారో!
‘ఇక్కడికి నాగార్జున(Akkineni Nagarjuna) గారు వచ్చారు, ఆయన ముందు యంగ్ గా కనిపించడం కోసమే నేను కూడా ఇలా వచ్చాను, రజనీకాంత్ గారితో పని చేసి నేను 36 ఏళ్ళు అయ్యింది. కూలీ షూటింగ్ నాకు మొదటి రోజు హైదరాబాద్ లోనే జరిగింది. రజనీకాంత్ గారిని చూడగానే, నేను 39 ఏళ్ళ క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని చెప్పాను. సార్ మీరింకా నాగార్జున గారిని చూడలేదు, ఆయన ఏమి చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ, యంగ్ గా కనిపిస్తున్నాడు అని చెప్పాడు. సౌబిన్ సాహిర్ తో మోనికా పాటకు అద్భుతమైన స్టెప్పులు వేయించావ్ లోకేష్,కానీ నువ్వు నాకు ప్రమాణం చెయ్యాలి, నీ తదుపరి చిత్రం లో నాతో కూడా అలాంటి స్టెప్పులు వేయించాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యాంకర్ సుమ మోనికా పాటకు స్టెప్పులు వేయమని సత్యరాజ్ ని రిక్వెస్ట్ చేయగా, ఆయన స్టేజి మీద కొన్ని స్టెప్పులు వేస్తాడు. అవి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.