Smartphones: దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. నిత్యజీవితంలో స్మార్ట్ ఫోన్ కూడా భాగమైపోయింది. ఆన్ లైన్ క్లాసుల కోసం, ఆఫీస్ పనుల కోసం చాలామంది స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. అయితే ఇదే సమయంలో స్మార్ట్ ఫోన్ యూజర్లకు టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. యాప్ లు, ఈ మెయిల్స్, మెసేజ్ ల ద్వారా సైబర్ నేరగాళ్లు స్మార్ట్ ఫోన్లలోని సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం చేస్తున్నారు.

యూజర్ల మొబైల్స్ లోకి వైరస్ ను పంపి మోసాలు చేస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ స్లో కావడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. అయితే ఫోన్ వైరస్ బారిన పడితే మాత్రమే చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా స్మార్ట్ ఫోన్ లో వైరస్ ఉందో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అకస్మాత్తుగా తగ్గిపోతుంటే వైరస్ కారణమని గుర్తు పెట్టుకోవాలి. హ్యాకర్స్ కొన్నిసార్లు మన మొబైల్స్ నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్ లు పంపి యాప్ ల సహాయంతో కొనుగోళ్లు జరుపుతుంటారు. మీ స్మార్ట్ ఫోన్ లో కూడా ఇలాంటి సమస్య ఉంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్లే స్టోర్ లో కొన్ని ఫేక్ యాప్స్ ఉంటాయి. ఫేక్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ఆ యాప్స్ ద్వారా మొబైల్ లో వైరస్ చేరే ఛాన్స్ ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ లో తరచూ యాడ్స్ కనిపిస్తున్నా వైరస్ వల్లే యాడ్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఫోన్ లో అనుమతి లేకుండా కొత్త యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్ లో వైరస్ ఉంటే ఫోన్ ను రీసెట్ చేయడం ద్వారా వైరస్ ను తొలగించవచ్చు.
Also Read: BSNL Offers: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్.. ఫ్రీగా నాలుగు నెలల ఇంటర్నెట్ పొందే ఛాన్స్!