Men And Women Relationship: ఆడవారు అందంగా ఉంటారు. వారి అందాన్ని కీర్తించని కవి లేడు. అలాంటి ఆడాళ్లను మగాడు ఇష్టపడుతుంటాడు. వారితో మాట్లాడటానికి మగవాడు తహతహలాడతాడు. తాకితే ఉప్పొంగిపోతాడు. తనను మెచ్చిందని సంతోష పడతాడు. ఆమె శరీరాన్ని స్ర్పశించడానికి పరవశం పొందుతాడు. స్త్రీ ప్రతిభాగాన్ని మగాడు తాకాలనే భావిస్తాడు. తల నుంచి కాళ్ల వరకు ఆరాధనగానే చూస్తాడు. ఆమె అందానికి బందీ అవుతాడు. మగువను నిరంతరం ప్రేమిస్తాడు.

-మగాళ్లలో ఆడాళ్లు ఏం కోరుకుంటారు?
మగాడు ఏం చేసినా ఫర్వాలేదు కానీ తాగుబోతును మాత్రం ఇష్టపడరు. ఇంకా అబద్దాలు ఆడేవారిని దూరంగా ఉంచుతారు. తనను తానుగా ప్రేమించేవాడినే కావాలనుకుంటారు. తనకు మాత్రమే సొంతమవ్వాలని ఆశిస్తాడు. పరాయి స్త్రీ సాంగత్యాన్ని అసహ్యించుకుంటారు. నా మొగుడు నాకే సొంతం అని అనుకుంటారు. అలాంటి మగాడినే వలచి వస్తారు. వారితోనే జీవితం గడపాలని కోరుకుంటారు. ఇలా ఆడవారు తమ భాగస్వామిని ఇన్ని కోణాల్లో ఆలోచించి వారితో జీవితం పంచుకోవాలని అనుకుంటారు.
మగాడి మగతనం చూపించాల్సింది పడక గదిలో కాదు. ఆమె మనసులో.. మగువ మనసు దోచుకున్నవాడికే ఆమె గుండెలో స్థానం ఉంటుంది. మగాడిననే అహంతో కాదు తను నా ఆరాధ్యురాలు అని నిరూపించుకుంటే ఆమె మనసులో స్థానం దక్కుతుంది. ఆమె మెచ్చనిదే మగాడి పప్పులు ఉడకవు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు తోడు నీడగా నిలిచేవాడే నిజమైన మగాడు. అంతేకానీ ఆమెను కష్టాల్లోకి నెట్టే వాడు కాదు. ఆడదాని మనసులో మంచి స్థానం దక్కించుకున్న వాడిని దేవుడిలా ఆరాధిస్తుంది. నిరంతరం ప్రేమిస్తుంది. అతడికి సర్వస్వం అర్పిస్తుంది.
మగాళ్ల మగతనం ఎలా చూపించాలి..
ఆడదాని రక్షణ బాధ్యత పూర్తిగా మగాడిదే. తనకు ఎంతటి కష్టమొచ్చినా తోడుగా నిలబడే వాడినే ఆడాళ్లు ఇష్టపడతారు. ఆపద సమయాల్లో అండగా ఉంటే ఆమెకు కొండంత ధైర్యం కలుగుతుంది. అలాంటి సమయంలో మగాడంటే అతడే అని అనుకుంటారు. అంతేకాని ఆమె కష్టాలను పట్టించుకోని వాడిని ఆడది ఇష్టపడదు. అతడి నుంచి దూరంగా ఉంటుంది. అతడిపై నమ్మకం పోయిందంటే అంతే సంగతి. ఆడాళ్ల విశ్వాసం కూడా చూరగొనాలి.

నువ్వు మగాడ్ర బుజ్జి అని ఆడవాళ్లు ఎప్పుడు అంటారు?
మగాళ్లతో గడిపే జీవితం ఎలా ఉంటుంది? జీవితాంతం తనకు రక్షణగా ఉంటాడా? మధ్యలోనే వదిలేస్తాడా? అనే కోణంలో మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అతడు సమర్థుడని తెలుసుకున్నాకే అతడికి తన మనసు ఇస్తుంది. తానే సర్వస్వం అనుకుంటుంది. ఈ నేపథ్యంలో మగాడి మగతనం పరుపు మీద కాదు పనిమీద చూపించాలి. అప్పుడే ఆమె మనసులో చివరి వరకు స్థానం పదిలం చేసుకుంటాడు. పది కాలాల పాటు ఆమెతో కలిసి జీవిస్తాడు. అప్పుడే ఆడు మగాడ్రా బుజ్జి అని ఆడాళ్లు అంటారు