Akhil Agent Movie: దర్శకుడు సురేందర్ రెడ్డి హీరో అఖిల్ తో ఏజెంట్ ప్రకటించి చాలా కాలం అవుతుంది. కారణం తెలియదు కానీ మూవీ ఆలస్యమైంది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఏజెంట్ చిత్రానికి మోక్షం కలిగింది. సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ ప్రోమో విడుదల చేశారు. అర్ధనగ్నంగా బంధించి ఉన్న అఖిల్ శరీరం రక్తసిక్తమై ఉంది. అఖిల్ ని కట్టిపడేసిన విలన్ ఎవరో చెప్పాలని అడుగుతున్నాడు. చెప్పరా సాలే… అని విలన్ కోప్పడగా, ‘సాలే కాదు వైల్డ్ సాలే అని పిలువు” అని అఖిల్ చెప్పడం మెస్మరైజ్ చేసింది.

ఏజెంట్ అంచనాలకు మించి ఉంటుందని ఈ చిన్న ప్రోమో హింట్ ఇచ్చింది. అలాగే రా ఏజెంట్ గా అఖిల్ యాక్షన్ దుమ్మురేపడం ఖాయమని అర్థమవుతుంది. కాగా అఖిల్ అరంగేట్రమే అదిరిపోయేలా ప్లాన్ చేశారు. హీరోగా ఆయన డెబ్యూ మూవీ ‘అఖిల్’ భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు.వివి వినాయక్ తెరకెక్కించిన అఖిల్ ఫలితం మాత్రం దెబ్బేసింది. దీంతో పంథా మార్చి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ బాటపట్టాడు. అవి కూడా ఫలితం ఇవ్వలేదు. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో హిట్ కొట్టాడు.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. అఖిల్ టార్గెట్ మాత్రం మాస్ హీరోగా ఎదగడం. అందుకే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఆయన్ని రా ఏజెంట్ గా సరికొత్త రూపంలో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నాడు. సాక్షి వైద్య అఖిల్ కి జంటగా నటిస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక రోల్ చేయడం విశేషం. అనేక ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఏజెంట్ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఏజెంట్ విజయంపై ఫుల్ కాంఫిడెన్స్ తో ఉన్న టీం పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు.

ఈ మధ్య టైర్ టు హీరోలు సైతం పాన్ ఇండియా బాట పట్టారు. హీరో నిఖిల్ కార్తికేయ 2 తో ఆల్ ఇండియా లెవెల్ హిట్ కొట్టి స్ఫూర్తిగా నిలిచారు. సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మైఖేల్ అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేశారు. నాని నటించిన దసరా సైతం తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఏజెంట్ కి పాన్ ఇండియా మూవీగా విడుదల చేసే అన్ని అర్హతలు ఉన్నాయని యూనిట్ భావిస్తున్నారు. మరి అఖిల్ తొలి ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
