Extramarital Affairs: నమ్మకమనే ఇరుసుకు రెండు చక్రాల్లాంటి వారే భార్యాభర్తలు. సంసారం సాఫీగా సాగాలంటే ఇద్దరిలో నమ్మకమే ప్రధానం. నమ్మకమనే బేసిక్ మీదే ప్రపంచం నడుస్తోంది. దీంతో భార్యాభర్తల్లో కూడా నమ్మకానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఒకసారి దంపతుల మధ్య అనుమానాలు వచ్చాయంటే ఇక అంతే సంగతి. దంపతుల మధ్య అపార్థాలు, అనర్థాలు రాకుండా ఉండాలంటే వారి మధ్య నమ్మకమనే పునాదిపైనే ఆధారపడి ఉంటుంది. రానురాను రాజు గారి గుర్రం గాడిదయిందన్నట్లు ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.

వివాహేతర సంబంధాల పరంపర పెరుగుతోంది. దీంతో జీవిత భాగస్వామిని కూడా కడతేర్చే వరకు వెళ్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలు ఎక్కువవుతున్నాయి. పరాయి మహిళ మోజులో పడి భార్యలను సైతం మట్టుబెడుతున్నారు. పరాయి మగాడి మోజులో పడిన కొందరు ఆడవారు తమ భర్తలను కడతేర్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఒకరిపై మరొకరికి నమ్మకాలు లేకుండా పోతున్నాయి. పరాయి మగాడు, ఆడదాని వలలో పడిన చాలా మంది తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు.
వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలు అనేకం ఉంటున్నాయి. ఇందులో పరిచయాలు ప్రధానమైనవి. ఆడ, మగ వారిలో ఏర్పడిన స్నేహం కాస్త వారిలో కొత్త ఆశలకు పునాదులు వేస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఆకర్షణ పెరిగి అది కాస్త వివాహేతర సంబంధాలకు నెలవవుతోంది. వారి మధ్య ఏర్పడిన సంబంధంతో జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేసే వరకు వెళ్తోంది. దీంతో జీవిత భాగస్వామి కంట పడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతున్నా ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతోంది.

కొత్త పరిచయం కావడంతో వారు మాట్లాడే మాటలకు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య సన్నిహితం పెరుగుతోంది. ఫలితంగా వారి మధ్య లైంగిక సంబంధం కూడా ఏర్పడుతోంది. అనుకోకుండా మొదలైన బంధం కాస్త బలంగా మారి ఇద్దరి జీవితాలను నాశనం చేసే వరకు వెళ్తోంది. పెళ్లాం, మొగుడికి బోరు కొట్టడంతో కొత్త వారి కోసం ఆశపడుతున్నట్లు కూడా చెబుతుంటారు. దీంతో వివాహేతర సంబంధాలతో కుటుంబాలు కుదేలవుతున్నాయి. జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తూ వివాహేతర సంబంధాలకే విలువిస్తున్నారు.
భాగస్వామిని తప్పించుకు తిరగడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. వివాహ బంధానికి బీటలు వారుతున్నా పరాయ మగువ కోసం ప్రయత్నిస్తుంటారు. పరాయి వారి ఆకర్షణకు గురికావడంతో సంసారం గుల్ల అవుతోంది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాల మోజులో పడి జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది.