Centennial Mystery: 1911 సంవత్సరంలో ఇటలీలో ఓ రైలు అధృశ్యమైంది. నిజంగానే ఇది ఆశ్చర్యకరమే. విమానాలు, ఓడలు ప్రయాణించే మార్గంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే సముద్రాల్లో మునిగితే మనకు దొరకని సందర్భాలున్నాయి. కానీ రైలు మిస్సింగ్ మాత్రం నిజంగా మిస్టరీయే. ఇది జరిగి వందేళ్లవుతున్నా ఇప్పటికి దీని ఉనికి ప్రశ్నార్థమైంది. 106 మందితో ప్రయాణించే రైలు కనిపించకుండా పోవడం పెద్ద సంచలనమే. కానీ ఇది అక్షరాలా సత్యం. దీనికి సంబంధించిన అవశేషాలు కూడా లభించకపోవడం విశేషం.

ఇటలీలోని రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు సొరంగ మార్గంలో ప్రయాణించే సమయంలోనే కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. కానీ ఆ రైలు ఎక్కడకెళ్లిందనే విషయం మాత్రం సస్పెన్స్. ఇప్పటికి కూడా దాని గురించి జాడ మాత్రం తెలియరాలేదు. ప్రయాణికులు కూడా ఆచూకీ లభించలేదు. లంబార్టీ అనే కొండను తొలిచి సొరంగ మార్గం నిర్మించినట్లు తెలుస్తోంది. సొరంగంలోకి వెళ్లిన రైలు తిరిగి రాలేదు. రైలుకు ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అందులో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులు మాత్రం బయట కనిపించడం విశేషం.
Also Read: ఈ మూడు రాశుల వారికి ఎంతో తెలివి.. ఎలాంటి వారినైనా ఇట్టే పసిగడతారు..!
వారు చెప్పిన మాటలు కూడా ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. రైలు నుంచి పొగలు రావడంతో దూకేశామని చెప్పారు. కాలక్రమంలో వారికి మతిభ్రమించడం మరో ట్విస్ట్. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆ సొరంగం మూసేశారు. రైలు మాత్రం ఇప్పటికి కనిపించలేదు. దీనిపై ఓ కథ మాత్రం ప్రచారంలో ఉంది. టైమ్ మిషన్ ఆధారంగా దాన్ని 71 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇదంతా నిజం కాకపోయినా రైలు అదృశ్యం మాత్రం విచిత్రమే.
అయితే ఈ రైలు 1840లో మెక్సికోకు చేరుకుందని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. కొంతమంది వింత వ్యక్తులు వింత దుస్తులు ధరించి ఉన్నారనే వార్తలు సైతం సంచనం రేపాయి. ఇదంతో ఓ సినిమా కథలా ఉంది. అచ్చంగా ఇలాంటి కథాంశంతోనే ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కూడా రైలు అదృశ్యంపైనే కథనం సాగుతుందని భోగట్టా. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ రైలు సంఘటన ఆధారంగానే సినిమా తీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: సామాన్యులకు మరో శుభవార్త.. మరింతగా తగ్గనున్న వంటనూనె ధరలు?