Jaggery Tea : ఉదయం లేచిన వెంటనే టీ తాగకపోతే కొందరికి అసలు రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం టీతోనే స్టార్ట్ అవుతుంది. టీ ప్రేమికులు రోజులో ఎన్నిసార్లు టీ తాగుతారో అసలు లెక్క ఉండదు. ఏ టైమ్ అయిన టీ ఇస్తే తాగేస్తారు. అయితే టీలో ఎక్కువగా పంచదార కలిపి తాగుతారు. తక్కువగా అయితే పర్లేదు. కానీ ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం తెలిసినా కూడా పంచదార టీ తాగడం మాత్రం మానేయరు. టీ ప్రేమికులు తాగడానికి కిలోమీటర్లు దాటి మరి వెళ్తుంటారు. పంచదార ఎక్కువగా తీసుకుంటే షుగర్ రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అయిన డాక్టర్ల మాట వినకుండా కొందరు పంచదార టీ తాగుతుంటారు. కానీ ఎవరో ఒకరు టీలో పంచదారకి బదులు బెల్లం వేస్తున్నారు. పంచదార టీ కంటే బెల్లం టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ బెల్లం టీ రోజూ తాగడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా.
పూర్వం రోజుల్లో ఏవైనా పిండి వంటలు, పూజలకు ఏవైనా పదార్థాలు చేస్తే పంచదారకి బదులు బెల్లం ఉపయోగించేవాళ్లు. కానీ ఈరోజుల్లో చాలామంది అన్ని వంటలకు పంచదార ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే పంచదారకి బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి మేలు. బెల్లంలో ఉండే ఐరన్ శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. ఈ బెల్లం టీ హీమోగ్లోబిన్‌ను పెంచడంతో పాటు ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్లు బెల్లం టీ తాగితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బెల్లం టీ వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు బరువు కూడా తగ్గుతారు. బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే బెల్లాన్ని టీలో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. తక్కువగా మాత్రమే తీసుకోవాలి. టీలో మాత్రమే బెల్లాన్ని వాడకుండా ఇంట్లో వండే కొన్ని పదార్థాల్లో కూడా బెల్లం ఉపయోగించి వండుకోవచ్చు. ఉదాహరణకు పాయసం, స్వీట్స్, కేసరి వంటి వాటిలో పంచదారకు బదులు బెల్లం వాడుకోవచ్చు.
బెల్లం తినడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇందులోని పోషకాలు శరీరానికి అందడం వల్ల బలంగా ఉంటారు. అయితే ఏ పదార్థాన్ని అయిన తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు. బెల్లం ఎక్కువగా తింటే బాడీ వేడి చేస్తుంది. దీంతో ఫుడ్ జీర్ణం కాకపోవడం, విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈరోజుల్లో చాలామంది టీ, కాఫీలకు ఎక్కువగా ఆర్టిఫిషియల్ షుగర్‌ను వాడుతున్నారు. వీటిని వాడటం చాలా ప్రమాదకరం. వీటివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి పంచదార, ఆర్టిఫిషియల్ షుగర్లను కూడా వాడవద్దు. వీలైనంత వరకు షుగర్‌కు దూరంగా ఉండండి.