రైతులకు అలర్ట్.. ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉన్నాయంటే..?

దేశంలోని కోట్ల సంఖ్యలో రైతులు మే నెల ప్రారంభమైన తరువాత రుతుపవనాలు ఎలా ఉంటాయో తెలుసుకుని ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకుంటారు. వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులను అంచనా వేసి వర్షాలు పడుతాయా లేదా కరువు పరిస్థితులు నెలకొంటాయా..? అనే విషయాలను వెల్లడిస్తారు. లే నినా సహాయంతో వాతావరణ్ శాస్త్ర వేత్తలు పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. భూమధ్యరేఖ, పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ, తూర్పు బేసిన్లలో టెంపరేచర్ నమూనాల ఆధారంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం […]

Written By: Kusuma Aggunna, Updated On : May 3, 2021 12:23 pm
Follow us on

దేశంలోని కోట్ల సంఖ్యలో రైతులు మే నెల ప్రారంభమైన తరువాత రుతుపవనాలు ఎలా ఉంటాయో తెలుసుకుని ఏ పంట వేయాలో నిర్ణయం తీసుకుంటారు. వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులను అంచనా వేసి వర్షాలు పడుతాయా లేదా కరువు పరిస్థితులు నెలకొంటాయా..? అనే విషయాలను వెల్లడిస్తారు. లే నినా సహాయంతో వాతావరణ్ శాస్త్ర వేత్తలు పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది.

భూమధ్యరేఖ, పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ, తూర్పు బేసిన్లలో టెంపరేచర్ నమూనాల ఆధారంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది. లే నినా భారతదేశంలోని రుతుపవనాలకు ప్రసిద్ధి చెందింది కాగా ఎల్ నినో లే నినోకు పూర్తి వ్యతిరేకం కావడం గమనార్హం. అయితే 1997 సంవత్సరంలో మాత్రం విరుద్ధంగా జరిగింది. ఎన్ నినో వల్ల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలం వెచ్చగా ఉండగా గాలి వేగం మారుతుంది.

ఎన్ నినో వల్ల వాతావరణ చక్రం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. లే నినా తుఫానును కూడా ప్రభావితం చేయగలదు. జపాన్ నేషనల్ ఫోర్కాస్టర్ జామ్స్టెక్ శాస్త్రవేత్తలు లే నినో వస్తుందని లే నినో వల్ల భారతదేశంలో రుతుపవనాలు బాగానే ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

దేశంలోని రైతులకు రోజురోజుకు ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఖర్చులు పెరిగిన స్థాయిలో చాలామంది రైతులకు ఆదాయం పెరగడం లేదు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.