House Rent Agreement: సొంత ఇల్లు కట్టుకోవాలని.. సొంత ఇంట్లో ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అనివార్య కారణాలవల్ల సొంత ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో కొన్నాళ్లపాటు అద్దె ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేవారు.. అద్దె ఇంట్లో ఉంటూ తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే రెంటు ఇంట్లో ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అద్దెను ఇష్టం వచ్చినట్లు పెంచుతూ.. కిరాయిదారులను బానిసలుగా చూస్తారు. కానీ అద్దె ఇంట్లో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి. వీటి ప్రకారం అద్దె ఎలా పెంచాలంటే..?
Also Read: కేసీఆర్ అలా చేస్తున్నాడని.. రఘునందన్ రావుకు ముందే తెలుసా.. ఆంధ్రజ్యోతి ఆర్కే బయటపెట్టిన నిజం
అద్దె ఇంట్లో ఉండేవారు.. ఇంటి యజమానులు ఇరువురి మధ్య సరైన ఒప్పందం ఉంటే ఎలాంటి వివాదాలు ఏర్పడవు. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే అదే ఒప్పందం చేసుకోవాలి. నివాస గృహాల్లో సాధారణంగా ఇలాంటి ఒప్పందాలు ఉండకపోవచ్చు. కమర్షియల్ విషయానికి వస్తే అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే నగరాల్లో నేటి కాలంలో అనేక వివాదాలు ఏర్పడుతున్న తరుణంలో.. అదే ఒప్పందాలు చేసుకోవడం ఎంతో మంచిదని కొందరు చెబుతున్నారు. అద్దె నియంత్రణ చట్టం ప్రకారం అద్దెకు ఉండే వారికి.. ఇంటి యజమానులకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వీటి ప్రకారమే వారు నడుచుకోవాలి. లేకుంటే ఇరువురు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అద్దెకు ఉండే వారిపై యజమానులకు అజమాయిషి ఉంటుంది. అయితే ఇది మర్యాదపూర్వకంగానే ఉండాలి. అంటే ఒకవేళ అద్దెను పెంచాల్సి వస్తే మూడు నెలలకు ముందే నోటీస్ ఇవ్వాలి. అంతేకాకుండా అద్దెను ఎందుకు పెంచుతున్నామో ఈ నోటీసులో పేర్కొనాలి. ఇష్టం వచ్చినట్లు అద్దెను పెంచడానికి వీలు లేదు. టాక్స్ పెరిగినప్పుడు.. ఇంటి నిర్మాణ ఖర్చులు చేసినప్పుడు.. ఇతర జన్యు అవసరాల కోసం అద్దెను పెంచాల్సి వస్తుందని నోటీసులో పేర్కొనాలి. అలా కాకుండా కేవలం లాభం కోసమే సంవత్సరానికోసారి అద్దెను పెంచుతామంటే కుదరదు. ఈ విషయంలో అద్దెకు ఉండేవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే.. లీగల్ గా పోరాటం చేయాల్సి ఉంటుంది.
అయితే ఇదే సమయంలో కిరాయి దారులు సైతం సరైన సమయంలో అద్దె చెల్లించినట్లయితే యజమానులు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కోర్టుకు వెళ్లే బదులు పెద్దమనుషులు మధ్య ఒప్పందాన్ని చేసుకోవడం మంచిది అని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే అద్దెకు ఉండేవారు అడ్వాన్స్ గా రెండు లేదా మూడు నెలల పాటు కిరాయి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అద్దెకు ఉండేవారు ఇంటికి సంబంధించి ఏదైనా నష్టం జరిగితే ముందే రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇలా అద్దెకు ఉండేవారు.. ఇంటి యజమానులకు మధ్య కొన్ని ఒప్పందాలు ఉండడంవల్ల ఎలాంటి వివాదాలు తలెత్తవు. అద్దెకు దిగేముందే అన్ని విషయాలు మాట్లాడుకుని ఉండాలి. లేదా ఒక అగ్రిమెంటు చేసుకోవడం వల్ల మరీ మంచిది. ప్రస్తుత కాలంలో కొందరు అద్దెకు ఉండేవారు యజమానులను, చుట్టుపక్కల వారిని ఇబ్బందులు పెడుతున్నారు. వీరి విషయంలోనూ చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం యజమానులకు ఉంటుంది.