https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు రవి యోగం.. ఈ కారణంగా ఈ 5 రాశుల వారికి అన్నీ శుభాలే..

వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడితో కొనసాగుతారు. శత్రువలతో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలివిగా చేసే కొన్ని పనులు విజయవంతం అవుతాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 27, 2024 / 08:47 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై రేవతీ భాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు. శనివారం రవియోగం, శష రాజయోగం కారణంగా 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడితో కొనసాగుతారు. శత్రువలతో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తెలివిగా చేసే కొన్ని పనులు విజయవంతం అవుతాయి.

    వృషభ రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు ఉంటాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతారు.కొందరికి అకస్మాత్తుగా ఆదాయం వస్తుంది. అయితే వాటిని పొదుపుగా ఖర్చు చేయాలి.

    మిథున రాశి:
    ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొందరు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

    కర్కాటక రాశి:
    వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శారీరక సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కొత్త వ్యాపారం చేయాలనుకుంటే ఇది మంచి సమయం కాదు. కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాలి. కొందరికి అనుకోని ఆదాయం వస్తుంది.

    సింహారాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి స్నేహితుల సలహా తీసుకుంటారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

    కన్య రాశి:
    కుటుంబ అవసరాల కోసం రుణం చేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొన్ని పనుల కోసం పెద్దల సలహా తీసుకుంటారు. పిల్లల భవిష్యత్ పై ఆందోళన చెందుతారు.

    తుల రాశి:
    ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు అధికమవుతాయి. అయితే పొదుపును అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే సక్సెస్ సాధిస్తారు. రాజకీయ రంగాల వారికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ పెడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.కొత్త వ్యక్తులతో సత్సంబంధాలు నెలకొంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులు ఆదాయం పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేయడం వల్ల కొన్ని పనులు సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సాయంత్ర తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.

    మకర రాశి:
    వ్యాపారులు ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు తమ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సాయంత్రం స్నేహితులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    కుంభరాశి:
    జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.

    మీనరాశి:
    అనుకోని ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు అదృష్టవంతులుగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. బంధువుల నుంచి కొంత సమాచారం అందుకుంటారు.