https://oktelugu.com/

Tollywood News : సలార్ నటుడు బండారం బయటపెట్టిన సింగర్ చిన్మయి, లైంగిక వేధింపులపై సంచలన పోస్ట్స్ వైరల్!

సింగర్ చిన్మయి శ్రీపాద కరుడుగట్టిన ఫెమినిస్ట్. మహిళలకు ఏ రూపంలో అన్యాయం జరిగినా ఆమె స్పందిస్తారు. రచయిత వైరముత్తు మీద ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాజాగా నటుడు జాన్ విజయ్ బండారం బట్టబయలు చేస్తూ ఆమె సోషల్ మీడియాలో వరుస పోస్ట్స్ పెడుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 27, 2024 / 09:56 AM IST
    Follow us on

    Tollywood News :  సింగర్ చిన్మయి శ్రీపాద చాలా కాలంగా మహిళపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చిన్మయి ఫెమినిస్ట్. దేశంలో ఎక్కడ మహిళలు లైంగిక వేధింపులకు, హింసకు, అన్యాయానికి గురైనా ఆమె స్పందించారు. సోషల్ మీడియా సందేశాలతో సమస్యను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్నేళ్లుగా చిన్మయి రచయిత వైరముత్తు మీద న్యాయపోరాటం చేస్తుంది.

    చాలా మంది మహిళలను వైరముత్తు లైంగికంగా వేధించాడు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టింది. వైరముత్తుకు పరిశ్రమలో గట్టి పలుకుబడి ఉంది. ఇండస్ట్రీ పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా సంబంధాలు మైంటైన్ చేస్తున్నారు. వైరముత్తు మీద చిన్మయి కేసులు పెట్టింది. న్యాయపోరాటం చేస్తుంది. తరచుగా ఆయనకు వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతుంటారు.

    తాజాగా కోలీవుడ్ నటుడు జాన్ విజయ్ బండారం బయటపెట్టింది. జాన్ విజయ్ పలువురు మహిళలతో చెడుగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఆమె వెల్లడించారు. కొందరు మహిళలు జాన్ విజయ్ ప్రవర్తన ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఆమె ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేశారు. జాన్ విజయ్ రోజు క్లబ్ లకు పబ్ లకు వెళతాడు. అక్కడ ఉన్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. తాను ఒక సెలెబ్రిటీ హోదాలో ఉండటం వలన కోరిన వెంటనే డాన్స్ చేయడానికి, కలిసి డ్రింక్ చేయడానికి అమ్మాయిలు వస్తారని భావిస్తాడు.

    పబ్ లో అమ్మాయిలను ఫాలో అవుతూ వారు వెళ్లే ప్రతి చోటకు వెళతాడు. ఇలాంటి వాళ్ళ నుండి పబ్ లో ఉన్న సిబ్బంది కొంత మేర సేవ్ చేస్తూ ఉంటారు. జాన్ విజయ్ ప్రవర్తన ఇబ్బందికరంగా ఉన్నా… సెలబ్రిటీ కావడంతో పబ్ సిబ్బంది బయటకు నెట్టి వేయరు, అని ఓ మహిళ రాసుకొచ్చింది.

    ఓ జర్నలిస్ట్ సైతం జాన్ విజయ్ అసభ్యకర ప్రవర్తన బయటపెట్టింది. ఓ యూట్యూబ్ ఛానల్ కోసం నేను జాన్ విజయ్ ని ఇంటర్వ్యూ చేశాను. మీ టూ ఉద్యమం గురించి పరోక్షంగా ప్రశ్నించాను అడిగాను. జాన్ విజయ్ కెమెరా ముందే అసభ్యకరంగా ప్రవర్తించాడు. నీచంగా మాట్లాడాడు. కెమెరాలో రికార్డు అవుతుందని తెలిసి కూడా నా హిప్ తాకేందుకు ప్రయత్నం చేశాడు. నేను షాక్ అయ్యాను. అంత కన్నా దారుణమైన విషయం ఏమిటంటే… ఆ ఇంటర్వ్యూ షూట్ చేస్తున్న డైరెక్టర్ ఒక లేడీ. ఇదంతా చూస్తున్న ఆమె జాన్ విజయ్ అంత చెడ్డవాడు అనిపించలేదని అన్నారు.

    నేను నా ఆఫీస్ కి వెళ్ళిపోయాను. జాన్ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి కంప్లైంట్ చేశాను.. అని ఆ మహిళా జర్నలిస్ట్ సందేశంలో రాసుకొచ్చింది. 2017లో 21 ఏళ్ల ఓ యంగ్ గర్ల్ తో కూడా జాన్ విజయ్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని మరొక అమ్మాయి ఆరోపణలు చేసింది. జాన్ విజయ్ కి వ్యతిరేకంగా మహిళలు చేసిన కామెంట్స్ ని చిన్మయి శ్రీపాద ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసిన నేపథ్యంలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. జాన్ విజయ్ వంటి వ్యక్తులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. జాన్ విజయ్ కాలా మూవీతో పాప్యులర్ అయ్యాడు. తెలుగులో భగవంత్ కేసరి, సలార్ చిత్రాల్లో కీలక రోల్స్ చేశాడు.