Horoscope Today: ప్రీతియోగం కారణంగా ఈ రాశుల వారికి ధన లాభం.. మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

కోర్టు కేసులు పెండింగులో ఉంటే అవి నేటితో పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.

Written By: Chai Muchhata, Updated On : July 21, 2024 9:08 am

Horoscope Today

Follow us on

Horoscope Today: ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. గురు పౌర్ణమి కారణంగా ఈరోజు కొన్ని రాశుల వారికి శుభయోగాలు కలగనున్నాయి. ఇదే సమయంలో మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
వ్యాపారులు ఈరోజు బిజీగా ఉంటారు. భవిష్యత్ కోసం కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతుల కు సంబంధించి వార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దమవుతారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.

వృషభ రాశి:
ఆదాయం కోసం వెతుక్కునే మార్గాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు భాగస్వాములతో కొత్త ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది.

మిథున రాశి:
కోర్టు కేసులు పెండింగులో ఉంటే అవి నేటితో పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.

కర్కాటక రాశి:
కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సమస్యలపై తల్లిదండ్రులతో చర్చిస్తారు. వ్యాపారులు పెద్దల సలహా తీసుకుంటారు.

సింహారాశి:
ఈరోజంతా సరదాగా ఉంటారు. వ్యాపారులు అంకిత భావంతో చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. వ్యాపారులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి.

కన్య రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవంపెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతుల విషయంలో శుభవార్త వింటారు. ఆస్తిని కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

తుల రాశి:
ఉద్యోగులకు కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు ఉంటుంది. ఈ కారణంగా ఈరోజంతా ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. తండ్రితో సమయం గడుపుతారు.

వృశ్చిక రాశి:
వ్యాపారులు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యల పరిష్కారం కోసం సీనియర్లను సంప్రదిస్తారు. కొన్ని ప్రాజెక్టుల్లో పురోగతి సాధిస్తారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాదనలు చేయొద్దు.

ధనస్సు రాశి:
ఉద్యోగులు భవిష్యత్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు కేసుల సమస్యలుచుట్టుముడుతాయి. తల్లి వైపు నుంచి మద్దతు ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు.

మకర రాశి:
వ్యాపారులు బిజీ వాతావరణంలో గడుపుతారు. వ్యక్తిగత జీవితం కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. బంధువుల నుంచి గౌరవం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి:
తల్లి ఆరోగ్యం కోసం శ్రమిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్దమవుతారు. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

మీనరాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్ష్లల్లోపాల్గొంటారు. వ్యాపారులకు సోదరుల సలహాలు అవసరం.