Health News: పిల్లలు పుట్టడం లేదా? పురుషులు ఇలా చేయండి.

వయసు పెరుగుతుంటే పురుషుల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గుతుంటుంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఆహారం, పోషకాహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి కాస్త బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. . వయసు పెరిగేకొద్ది వీర్యం పరిమాణం తగ్గుతుంటుంది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టంగా మారతుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం

Written By: Swathi, Updated On : July 21, 2024 10:28 am
Follow us on

Health News :  పిల్లలను కనాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పండి. కానీ ఈ సమయంలో పిల్లలను కనడం చాలా కష్టంగా మారింది. ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగితే గానీ పిల్లలు పుట్టడం లేదు. పిల్లలు లేకుండా కొందరు జీవితాన్ని గడిపేస్తుంటే కొందరు అనాథలను అక్కున చేర్చుకుంటున్నారు. అయితే పిల్లలు పుట్టకుండా ఉండటానికి కొన్ని సార్లు మహిళలు కారణం అయితే కొన్ని సార్లు పురుషులు కారణం అవుతున్నారు. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారా అలవాట్లే ముఖ్య కారణం. మద్యపానం, ధూమపానం వంటివి కూడా సమస్యను మరింత పెంచుతున్నాయి. మరి పురుషుల్లో సమస్యలు ఉంటే ఫెర్టిటిటీ శాతాన్ని ఎలా పెంచుకోవాలి అనే టిప్స్ ఇప్పుడు చూసేద్దాం.

వయసు పెరుగుతుంటే పురుషుల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గుతుంటుంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఆహారం, పోషకాహారం తీసుకోవడం వంటివి చేస్తుంటే ఈ సమస్య నుంచి కాస్త బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. . వయసు పెరిగేకొద్ది వీర్యం పరిమాణం తగ్గుతుంటుంది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టంగా మారతుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, ఆహారంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. సంతానోత్పత్తికి ఎలాంటి సమస్యలు ఉండవు అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా పురుషులు శరీర బరువులో జాగ్రత్త వహించాలి. ఎక్కువ బరువు ఉండకూడదు. తక్కువ కూడా ఉండకూడదు. లేదంటే హార్మోన్ల ఉత్పత్తి, స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తి సమస్య పెరగడం మొదలైంది. శారీరక శ్రమ వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేదంటే వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఉండండి. కానీ వ్యాయామం ఎక్కువగా కూడా చేయకూడదు. అధిక వ్యాయామం వల్ల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అధిక ఒత్తిడి స్థాయిలు స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన హార్మోన్లు పెరగనివ్వవు అంటున్నారు నిపుణులు. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి.

శరీరంలో ఎక్కువ వేడి కూడా ఉండకూడదు. ఎక్కువ వేడి ఉంటే వీర్యకణాల ఉత్పత్తికి ఆటంకం కలిగుతుంది. టైట్ దుస్తులను కూడా అసలు ధరించవద్దు. ఇలా చేయడం వల్ల వృషణం ఉష్ణోగ్రత పెరగదు. అంటే వీర్యకణాల ఉత్పత్తి మీద కూడా ఎలాంటి ప్రభావం పడదు.

ప్రస్తుతం సంతానలేమికి కారణం అవుతున్న కారకాల్లో ధూమపానం, మద్యపానం ముందు ఉంటున్నాయి. అధికంగా ధూమపానం, మద్యపానం చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. జింక్, సెలీనియం, విటమిన్-సి, ఇ వంటి పోషకాలు స్పెర్మ్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు స్పెర్మ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి అద్భుతంగా పని చేస్తాయి. కాబట్టి బాదం పప్పులు తినండి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సలహా ఇస్తున్నారు నిపుణులు.

విటమిన్ సి కంటిన్యూగా తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందట. దీని వల్ల శరీరానికి కావాల్సినంత ఆక్సిడెంట్లు లభిస్తాయి. రెండు నెలల పాటు రోజుకు రెండుసార్లు విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవాలి. లేదంటే విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా రోజూ ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా ఒత్తిడికి మాత్రం అసలు గురి అవద్దు. తరుచూ ఒత్తిడికి గురయ్యే వారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. తద్వారా సంతానోత్పత్తి పెరగదు. ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయి పెరుగడం వల్ల టెస్టోస్టెరాన్‌పై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి ఉండకూడదు అంటే నడక, ధ్యానం, వ్యాయామం వంటివి చేస్తుండాలి. అలాగే ఇష్టమైన పనులు చేయడం వల్ల మీరు మరింత రీఫ్రెష్ అవుతారు.