Healthy Hair: ఇటీవల కాలంలో జుట్టు సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా లేని వారి పరిస్థితి దారుణం. ఈ నేపథ్యంలో వారికి నలుగురిలో తిరగాలంటే నామోషీ. జుట్టు రాలిపోతే ఎలా తిరగడం, తెల్ల బడితే ముసలి వారిలా అనిపిస్తుంది. దీంతో వారు బయట నలుగురితో కలవడానికి జంకుతున్నారు. జుట్టు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక నానా రకాల షాంపూలు వాడుతూ ఫలితం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇలాంటి వాటికి ఇంట్లోనే తయారు చేసుకునే మంచి చిట్కా ఉంది.
దీని కోసం ఓ మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, మూడు కరివేపాకు రెబ్బలు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసి కలుపుకుని మూడు రోజుల పాటు ఎండలో పెట్టాలి. ఆ తరువాత దాన్ని ఫిల్టర్ చేసుకుని ఓ సీసాలో భద్రపరచుకోవాలి.
దీన్ని వెంట్రకల కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. అలాగే వదిలేసి మరుసటి రోజు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. జుట్టు లేదనే సమస్య ఉండదు. ఇలా ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన చిట్కా కావడంతో అందరు చేసుకోవచ్చు. ఎవరైతే జుట్టు ఎదగడం లేదని బాధపడుతున్నారో వారికిది మంచి ఔషధం.
ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగించుకోవాలి. దీని వల్ల మనకు జుట్టు సంబంధమైన సమస్యలు ఉండవు. ఇన్నాళ్లు ఏవేవో షాంపూలు, క్రీములు వాడి జుట్టును ఎటు కాకుండా చేసుకున్న వారికి ఇది మంచి పరిష్కార మార్గం. ఇతర ఉత్పత్తులు వాడుకుని కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు చేసుకోవద్దు. ఇంట్లోనే ఈ మందు తయారు చేసుకుని వాడుకుని జుట్టు బాగా పెరిగేందుకు అనువైన పరిస్థితులు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.