Homeలైఫ్ స్టైల్Home Loan Repayment Tips: హోం లోన్ ను ఇలా చెల్లిస్తే.. వడ్డీ భారం అసలే...

Home Loan Repayment Tips: హోం లోన్ ను ఇలా చెల్లిస్తే.. వడ్డీ భారం అసలే ఉండదు..

Home Loan Repayment Tips: ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణం లేకుండా ఎవరూ ఇల్లు కట్టడం లేదు. ఎందుకంటే తక్కువ వడ్డీతో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందనుంది. అంతేకాకుండా నెలనెలా తక్కువ మొత్తం ఈఎంఐ ఉండడంతో ఉద్యోగులకు, నెలనెలా ఆదాయం వచ్చే వారికి ఇది ఉపయోగపడనుందని అంటున్నారు. అయితే ఈ రుణం తీసుకునే సమయంలో కొన్ని విషయాలను గ్రహించాలి. ముఖ్యంగా గృహ రుణం తీసుకునేటప్పుడు చాలామంది ఈఎంఐ తక్కువగా ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు. దీంతో ఇది ఎక్కువ కాలపరిమితిగా ఉంటుంది. మొదట్లో ఇది సౌకర్యంగానే అనిపించినా ఆ తరువాత భారమంతా వడ్డీ రూపంలో ఉంటుంది. అదెలాగో చూద్దాం..

ఒక వ్యక్తి ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 50 లక్షల రుణం తీసుకున్నాడని అనుకుందాం.. ఈ మొత్తాన్ని 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలపరిమితితో పోలిస్తే 30 ఏళ్ల కాలపరిమితిలో బ్యాంకుకి వెళ్లే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల రుణంలో నెలవారీ ఈఎంఐ తగ్గినట్లే అనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో రుణం ఎక్కువ కాలం నిలిచిపోవడం వల్ల వడ్డీపై వడ్డీ లాగా మొత్తం భారం పెరుగుతుంది. సాధారణంగా రుణం ప్రారంభ దశలో మీరు చెల్లించే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. అసలు బాకీ తగ్గడం నెమ్మదిగా జరుగుతుంది. అందుకే కాలపరిమితి పెరిగే కొద్దీ మొత్తం చెల్లింపు మొత్తం భారీగా పెరుగుతుంది. అందుకే తక్కువ ఈఎంఐ లాభం అని ఎప్పుడూ అనుకోకూడదు.

దీనిని ఇలా పరిశీలిద్దాం.. రూ. 50 లక్షల రుణాన్ని 9% వడ్డీకి 20 ఏళ్లకు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 44,986 ఉంటుంది. అదే రుణాన్ని 30 ఏళ్లకు తీసుకుంటే ఈఎంఐ సుమారు రూ. 40,231కి తగ్గుతుంది. కానీ ఇక్కడే పెద్ద తేడా వస్తుంది. 20 ఏళ్లలో మొత్తం వడ్డీ సుమారు రూ. 57.97 లక్షలు అయితే.. 30 ఏళ్లలో అది సుమారు రూ. 94.83 లక్షలకు పెరుగుతుంది. అంటే అదనంగా దాదాపు రూ. 36.86 లక్షలు వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని రుణాల పరిస్థితుల్లో ఈ వ్యత్యాసం రూ. 34 లక్షల వరకు కూడా ఉండొచ్చు.

ఈ అదనపు వడ్డీ భారాన్ని తగ్గించడానికి ముందస్తు చెల్లింపులు చాలా ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం కొంత మొత్తం ప్రిన్సిపల్‌కు అదనంగా చెల్లిస్తే.. అసలు బాకీ వేగంగా తగ్గుతుంది. దాంతో భవిష్యత్తులో వడ్డీ లెక్కించే మొత్తం కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకు నెలకు రూ. 2,000–రూ. 5,000 అదనంగా చెల్లించినా, రుణ కాలం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రారంభ సంవత్సరాల్లో చేసిన ముందస్తు చెల్లింపు ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. ఎందుకంటే అప్పుడు ప్రిన్సిపల్ బాకీ పెద్దగా ఉంటుంది, కాబట్టి అదనంగా చెల్లించిన ప్రతి రూపాయి భవిష్యత్తు వడ్డీని ఎక్కువగా తగ్గిస్తుంది. రుణం చివరి దశలో ముందస్తు చెల్లింపులు చేసినా లాభం ఉంటుంది, కానీ ప్రారంభంలో చేసినంత కాదు.

తక్కువ ఈఎంఐ కోసం ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం కొంతమందికి అవసరం కావచ్చు. కానీ అది సేఫ్ ఆప్షన్ అన్న భావన మాత్రం సరైంది కాదు. మీ నెలవారీ ఆదాయం స్థిరంగా ఉంటే.. సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం మంచిది. లేదంటే 30 ఏళ్ల రుణం తీసుకున్నా.. మధ్యలో ప్రీపేమెంట్ చేయాలనే ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular