https://oktelugu.com/

Home Loan: హోమ్ లోన్ కడుతూనే రూ.20 లక్షలకు పైగా.. ఇలా సేవ్ చేయండి..

ఇల్లు పూర్తి కావాలంటే కనీసం రూ.50 లక్ష వరకు కావాల్సి ఉంటుంది. ఇందులో 30 లక్షల వరకు లోన్ తీసుకొని 20 సంవత్సరాల పాటు టెన్యూర్ పెట్టుకున్నారనుకోండి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 21, 2023 3:58 pm
    Home Loan

    Home Loan

    Follow us on

    Home Loan: ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. ఈ కలను పూర్తి చేసుకోవడానికి చాలా మంది లోన్లు తీసుకుంటూ ఉంటారు. రుణ సాయంతో ఇల్లును పూర్తి చేసుకుంటారు. ఆ తరువాత జీవితాంతం ఈఎంఐ చెల్లిస్తూ ఉంటారు.ఇల్లు కట్టేవారు 50 శాతం సొంత మనీ ఉండి.. మిగతా సొమ్మును లోన్ తీసుకుంటే ఎలాంటి బాధ ఉండదని ఇప్పటికే చాలా మంది ఫైనాన్స్ నిపుణులు చెప్పారు. కానీ కొందరు లోన్ త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో భారీగా ఈఎంఐ చెల్లిస్తారు. కానీ ఇలా చెల్లించడం వల్ల జీవితాంతం ఇల్లు అప్పు తీరడానికే సరిపోతుంది. దీంతో పిల్లల భవిష్యత్ కోసం.. ఇతర అవసరాలకు డబ్బు కనిపించదు. అయితే ఈ బెస్ట్ ప్లాన్ ద్వారా లోన్ ఈఎంఐ చెల్లిస్తూనే రూ.50 లక్షల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు.

    ఒక ఇల్లు పూర్తి కావాలంటే కనీసం రూ.50 లక్ష వరకు కావాల్సి ఉంటుంది. ఇందులో 30 లక్షల వరకు లోన్ తీసుకొని 20 సంవత్సరాల పాటు టెన్యూర్ పెట్టుకున్నారనుకోండి. వడ్డీతో కలిపి రూ.15 వేలకు పైగానే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంత మంది ఇల్లు అప్పు త్వరగా తీర్చాలన్న ఉద్దేశంతో రూ.15 వేల కంటే ఎక్కువగా ఈఎంఐ సెట్ చేసుకుంటారు. మరికొందరు ఇతర మార్గాల ద్వారా వచ్చిన సొమ్మును ఈ లోన్ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటారు.

    కానీ అలా చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. బ్యాంకులు ఒక్కసారి లోన్ ఇచ్చిన తరువాత వడ్డీలో ఎలాంటి మార్పులు చేయదు. ముందుగా చెల్లించినంత మాత్రాత తక్కువ వడ్డీ ఇస్తుందనుకోవడం పొరపాటే. అందువల్ల తక్కువ ఈఎంఐ ని సెట్ చేసుకొని ఇదే సమయంలో రూ.5000 వరకు ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉదాహరకు లోన్ ఈఎంఐని రూ.20 వేలకు పెంచాలని అనుకున్నారు. కానీ మిగతా రూ.5000 ల మొత్తాన్ని సిప్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టి ఇల్లు అప్పు మొత్తం తీరే వరకు వేచి చూడండి.

    దీంతో అప్పటి వరకు జమ చేసిన మొత్తం కలుపుకొని 12 లక్షలు అవుతుంది.అప్పటి వడ్డీ రేటు ప్రకారం అదనంగా మరింత యాడ్ చేసి రూ.20 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ద్వారా అధిక వడ్డీ వస్తుంది. ఓ వైపు ఇల్లు అప్పు తీరుతూనే మరోవైపు సేవింగ్స్ పెరుగుతాయి. ఇలా ఒకేసారి రెండు రకాలుగా సేవ్ చేసుకోవచ్చు.