Jobs: హెచ్‌ఎమ్‌టీ లిమిటెడ్, బెంగళూరు నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 3 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేటర్ ఏ మెయింటెనెన్స్ (సివిల్), ఆపరేటర్ ఏ మెయింటెనెన్స్ (ఎలక్ట్రికల్), ఆఫీస్ అసిస్టెంట్ ఏ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి.
బీకాం డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 9,140 రూపాయల నుంచి 23,150 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 28 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని సమాచారం. https://www.hmtindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.
తక్కువ సంఖ్యలో జాబ్స్ ఉండటం వల్ల అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.