CM’s Nephew Arrested: పంజాబ్ లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు పై ఈడీ అధికారులు కొరఢా ఝుళిపించారు. అక్రమ ఆస్తులు, ఇసుక రవాణా, మనీలాండరింగ్ తదితర కేసులు నమోదు చేశారు. దీంతో ఆయనను గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రాత్రి వరకు ప్రశ్నించిన తరువాత అరెస్టు చేశారు. దీంతో పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు పై అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో భూపీందర్ సింగ్ హనీ నివాసాలతో పాటు పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు ఆయనను అరెస్టు చేశారు. కానీ ఎన్నికల సందర్భంలో అరెస్టు చేయడంతో బీజేపీపై విమర్శలు వస్తున్నాయి. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేథ్యంలో భూపీందర్ అరెస్టు సంచలనం అవుతోంది.
భూపీందర్ సింగ్ ఇంట్లో రూ.10 కోట్ల నగదు, రూ.21 లక్షల బంగారం, రూ. 10 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ లు, కీలక డాక్యుమెంట్లు లభించాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టుకు ఈడీ అధికారులు ముందుకొచ్చారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని చెబుతున్నారు. రాజకీయంగా భూపీందర్ సింగ్ అరెస్టు సంచలనం రేపుతోంది.
Also Read: బాలయ్య సంచలన నిర్ణయం.. చెప్పినట్టు చేస్తే జగన్ కు నష్టమే !
గతంలో పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని పర్యటనలో ఫిరోజ్ పూర్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధానిని రోడ్డుపై అడ్డుకున్న ఘటనపై ప్రధాని సీరియస్ గా ఉండటంతో ఇలా చేస్తోందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. మొత్తానికి సీఎం మేనల్లుడు అరెస్టు వ్యవహారం ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు. ప్రతిపక్షాలు మాత్రం బీజేపీపైనే నిందలు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్ లో బీజేపీకి బలం లేకపోవడంతో ఇలాంటి తతంగాలకు పాల్పడుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్ లో ఎన్నికల వేళ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలనే ఈ విధంగా చేస్తుందని ఆరోణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఎక్కడకు దారి తీస్తుందో తెలియడం లేదనే వాదనలు వస్తున్నాయి.
Also Read: బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయి.. నిత్యం అందులో పెట్టి తీసుకెళ్తున్న అబ్బాయి..