Highest Salary Countries: ఉద్యోగం, జీతాలు, జీవితాలు బాగున్న టాప్ దేశాలు ఇవే..

రీసెంట్ గా ఉద్యోగుల గురించి వారి ఉద్యోగాల గురించి రాండ్‌స్టాడ్ నివేదిక కొన్ని విషయాలను తెలిపింది. దీని ప్రకారం, 57% మంది ఉద్యోగులు తమ పని-జీవిత సమతుల్యతను ప్రభావితం చేసే ఉద్యోగాన్ని చేయడానికి ఇష్టపడటం లేదు.

Written By: Swathi, Updated On : June 22, 2024 12:07 pm

Highest Salary Countries

Follow us on

Highest Salary Countries: పని ఒత్తిడి, బీజీ లైఫ్ వల్ల చాలా మంది పర్సనల్ లైఫ్ కు, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేక పోతున్నారు. సంతోషం, స్పెషల్ కేర్ లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని ఆఫీస్ లలో ఎనిమిది గంటల డ్యూటీ ఉంటే మరికొన్ని సంస్థలలో 12 గంటల డ్యూటీ కూడా ఉంటుంది. ఒక రోజు 12 గంటల డ్యూటీ చేస్తున్న వ్యక్తి ఇతర వాటికి సమయం కేటాయించడం చాలా కష్టమే. ఇది మన దేశంలో ఉన్న చాలా సంస్థల, వ్యక్తుల పరిస్థితి. అయితే బెస్ట్ క్వాలిటీ ఉద్యోగాలు ఉన్న దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రీసెంట్ గా ఉద్యోగుల గురించి వారి ఉద్యోగాల గురించి రాండ్‌స్టాడ్ నివేదిక కొన్ని విషయాలను తెలిపింది. దీని ప్రకారం, 57% మంది ఉద్యోగులు తమ పని-జీవిత సమతుల్యతను ప్రభావితం చేసే ఉద్యోగాన్ని చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే రీసెంట్ గానే గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్‌ రిమోట్ నివేదిక అధిక GDP ఉన్న టాప్ 60 దేశాలను తెలిపింది. ఈ జాబితా నుంచి కొన్ని అగ్ర దేశాలను జాబితాను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

న్యూజిలాండ్: గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం, న్యూజిలాండ్ అత్యుత్తమ ఉద్యోగాలను అంటే పనిని కల్పిస్తుందట. అందులో ముఖ్యంగా ఉద్యోగుల జీవితాన్ని కూడా అంచనా వేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థ, 32 రోజుల వార్షిక సెలవుల భత్యం, 80% అనారోగ్య వేతన రేటు, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉన్న దేశంగా పేరు సంపాదించింది.

స్పెయిన్: యూరోపియన్ దేశమైన స్పెయిన్ ఎక్కువగా చట్టబద్ధమైన వార్షిక సెలవులను అంటే 36 రోజులను అందిస్తుందట. వారానికి చాలా తక్కువ పని గంటలను చేయిస్తారట కూడా. కేవలం వారంలో 40 గంటలు మాత్రమే వర్క్ చేస్తారట. వారంలో ఐదు రోజులు పని చేయాలి. అది కూడా కేవలం 40 గంటలు మాత్రమే. ఇక గరిష్టంగా వారానికి 48 గంటలు మాత్రమే చేయాలి. ఇంతకు మించి పని చేస్తే కచ్చితంగా ఓవర్ టైమ్ కింద అధిక డబ్బు వెచ్చించాల్సిందే.

ఫ్రాన్స్: ఐరోపాలోని అతిపెద్ద దేశాలలో ఫ్రాన్స్ ఒకటి. ఈ దేశం ప్రపంచంలో అత్యధిక GDPని కలిగి ఉంది. వివిధ కారణాల వల్ల గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్ 2024లో ఫ్రాన్స్ 3వ స్థానంలో చేరింది. వారానికి తక్కువ పని గంటలు (అంటే సగటున వారానికి 25.6 గంటలు) చేస్తారు. ఇక సంవత్సరానికి 36 రోజుల వార్షిక సెలవులు కేటాయిస్తారు. అంతేకాకుండా, ఫ్రాన్స్‌కు “డిస్‌కనెక్ట్” చట్టం కూడా ఉందట. ఈ చట్టం ప్రకారం.. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత ఈమెయిల్స్ కు, కాల్స్ కు స్పందించాల్సిన అవసరం లేదట.

ఆస్ట్రేలియా: గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం, ఏ ఇతర దేశంతో పోల్చినా ఆస్ట్రేలియాలో గంటకు అత్యధిక కనీస వేతనం చెల్లిస్తారట. ఈ దేశం ప్రజలకు మంచి ఆరోగ్య సంరక్షణను, సేవలను అందిస్తారు. అనారోగ్యంతో సెలవు పెట్టుకుంటే వంద శాతం జీతం చెల్లించాల్సిందేనట. అత్యుత్తమ పని-జీవిత సమతుల్యత కలిగిన అగ్ర దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి.