Lord Ganesh Idol: సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం మొదటి పూజ్యుడిగా వినాయకుడికి ఎన్నో పూజలు చేస్తాము.మనం చేసే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగాలని ముందుగా వినాయకుడి ఆశీస్సులు తీసుకున్న తరువాతనే ఇతర పూజా కార్యక్రమాలు ప్రారంభించాలని పండితులు కూడా చెబుతుంటారు.ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల మనం చేసే కార్యం పై ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయని భావిస్తారు. కానీ ఎంతో పవిత్రమైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే.

ఎవరైతే ఇల్లు మొత్తం సిరిసంపదలు ఆనందాలతో వెల్లివిరియాలని కోరుకుంటారో అలాంటి వారు తెలుపు వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవడం ఎంతో ఉత్తమం. స్వీయ అభివృద్ధి కోరుకునే వ్యక్తులు సింధూర వర్ణం కలిగిన వినాయకుడి ప్రతిమను ఇంట్లోకి తెచ్చుకోవాలి. అయితే మనం ఇంట్లో పూజ చేసుకోవడం కోసం తెచ్చుకొనే వినాయకుడు నిలబడినది కాకుండా కూర్చున్న ప్రతిమను తీసుకోవడం వల్ల ఎంతో శుభమని ఇలాంటి వినాయకుడికి పూజ చేయడం వల్ల అదృష్టం మరియు విజయం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Also Read: పొరపాటున కూడా శనివారం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు!
కూర్చున్న వినాయకుడి ప్రతిమతో పాటు వినాయకుని తొండం ఎడమవైపు తిరిగి ఉన్నది ఎంతో శుభకరం.అయితే మీరు ఎక్కడైనా పనిచేస్తున్న సమయంలో అలాంటి చోట్ల వినాయకుడి ప్రతిమ పెట్టుకోవాలి అనుకుంటే అలాంటప్పుడు నిలబడి ఉన్న వినాయకుడి ప్రతిమను పెట్టుకోవడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా వినాయక విగ్రహంతో పాటు ఉండ్రాళ్ళు, ఎలుక విగ్రహం ఉన్నది పెట్టుకోవడం ఎంతో ఉత్తమం.ఓకే దేవుడి గదిలో ఓకే వినాయకుడి విగ్రహం ఉండాలి అలాగే వినాయకుడికి సమర్పించడం మర్చిపోకూడదు. అలాగే మన ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంట్లో స్వస్తిక్ చిహ్నం పెట్టుకోవడం ఉత్తమం.
Also Read: ఈ రాశుల వారికి ఈ సంవత్సరం ముట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందో లేదో చూడండి..
[…] Also Read: ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టేవారు … […]