Demand For Indian Cars: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత్ ముందుకు వెళుతుంది. Automobile రంగం విషయానికి వస్తే మిగతా దేశాల్లో కంటే భారత్ లోనే ఎక్కువగా వాహనాలు తయారవుతున్నాయి. కొన్ని విదేశీ కంపెనీలో సైతం భారత్ లో తమ బ్రాండ్లను ప్రారంభించి ఇక్కడి నుంచి విదేశాలకు సరఫరా చేస్తున్నాయి. వీటిలో Hyundai గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దక్షిణ కొరియా దేశానికి చెందిన హుందాయి కంపెనీ భారత్లో రెండు దశాబ్దాల కిందటే వాహనాలను విక్రయించడం ప్రారంభించింది. ఇక్కడ హుందాయి ఇండియా పేరుతో వాహనాలను తయారు చేసి దేశీయ వినియోగదారులకు మాత్రమే కాకుండా విదేశాలకు సరఫరా చేస్తుంది. ఇక్కడి నుంచి విదేశాలకు సరఫరా చేయడానికి సులభమైన మార్గాలు ఉండడంతో అత్యధిక వాహనాలను పంపిస్తోంది. కొన్ని లెక్కల ప్రకారం హుందాయి కార్లు ఆఫ్రికా దేశాలకు 10 లక్షల వరకు పంపించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారత్లో తయారైన వాహనాలు ఎగుమతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. భారత్ నుంచి ప్రధానంగా చీలి, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు hyundai కార్లు
ఎగుమతులు అవుతున్నాయి. మొత్తం 25 ఏళ్లలో 3.7 మిలియన్ల వాహనాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కంపెనీ 2024 ఏడాదిలో 1, 58, 686 యూనిట్లు ఎగుమతులు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కంపెనీ వాహనాలను తయారుచేస్తుంది.
హుందాయి కంపెనీకి చెందిన సాయంత్రం నుంచి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు వివిధ మాడలను విదేశాలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 60 దేశాలకు పైగా ఈ కంపెనీ కార్లు నిత్యం ఎగుమతులు అవుతున్నాయి. వీటిలో ఐటెం సిరీస్ ఇక్కడి నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన మాడల్ గా పేరు తెచ్చుకుంది. ఈ కంపెనీకి చెందిన మాడల్ మొత్తం 15 లక్షలు గా ఉండడం విశేషం. అలాగే వెర్నాకారును 5 లక్షల వరకు సరఫరా చేశారు.
మిగతా దేశాల్లో కంటే ఇండియాలో వాహనాల తయారీ ఖర్చు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిపుణులు కూడా అందుబాటులో ఉండడంతో వాహనాల మేకింగ్ ఈజీ అవుతుంది. ఇక ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు పంపించడానికి సముద్ర మార్గం కూడా ఉండడంతో వాహనాల ఎగుమతి సులభంగా మారింది. అంతేకాకుండా భారత్ లో తయారీ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడి వాహనాల ఎగుమతి ఎక్కువగా ఉంటుంది.
హుందాయి కంపెనీ 1999 నుంచి ప్రపంచ దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తూ వస్తోంది. ఇక్కడ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా భారత్ వినియోగదారులకు అనుగుణంగా ఉండే వాహనాలను అందించింది. అయితే మిగతా కంపెనీల కంటే హుందాయి నుంచి ఎక్కువ వాహనాలు విదేశాల్లో ప్రజాదారణ పొందుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాగే ఎగుమతులు చేస్తూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా Exter, అల్కాజార్, i10 వాహనాలు ఎగుమతి అవుతున్నాయి.