Heartattack Men vs Women:ఇప్పుడున్న కాలంలో ఏ పని చేసినా ఒత్తిడితోనే కలిగి ఉంటుంది. విద్యార్థుల నుంచి.. పెద్దవారి వరకు ప్రతి పని పూర్తి చేయాలంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ లేకుండా మానసికంగా మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా స్ట్రెస్ గా ఫీల్ అయి గుండెపై భారం పడుతుంది. అందువల్లే చాలామంది వయసు తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అయితే గుండెపోటు బారిన పడే వారిలో ఆడవారి కంటే మగవారే ఎక్కువగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా మానసికంగా తీవ్ర ఒత్తిడితో కలిగిన మగవారు గుండెపోటుతో 11.2 శాతంతో మరణిస్తే.. ఆడవారు 5.5%తో మరణిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి తేడా ఎందుకు ఉందంటే?
కాలేజీ వయసు వరకు ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ లైఫ్ ను అనుభవిస్తారు. కానీ ఇప్పుడే కష్టాలు మొదలవుతాయి. కొందరు కెరీర్ విషయంలో తీవ్ర మదన పడుతుంటే.. మరికొందరు గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఆరాట పడుతుంటారు. అయితే గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో కొందరు చిన్న వయసులోనే గుండెపోటుతో ఆస్పత్రుల పాలైన సంఘటనలు ఉన్నాయి. అయితే వీరిలో ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. ఆడవారు కంటే మగవారు తమ బాధను లోలోపలే అంచుకుంటారు. ఎవరితో చెప్పుకోలేరు. ఇలాంటి సమయంలో ఏదైనా మోసానికి గురైయితే తీవ్రంగా స్ట్రెస్ కు గురవుతారు. ఇలాంటి సమయంలో చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. చెస్ట్ పెయిన్ వచ్చిన సమయంలో లెఫ్ట్ సైడ్ ఉన్న వెంట్రుకలు స్పందనకు గురవుతాయి. ఇలా గురైన సమయంలో రక్త ప్రసరణ తక్కువవుతుంది. ఫలితంగా గుండెకు అవసరమైన రక్తం చేరదు.
దీంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కేవలం గర్ల్ ఫ్రెండ్ విషయంలోనే కాకుండా ఉద్యోగం చేసేవారు.. ఇతర పనులు చేసేవారు తీవ్రంగా బాధపడుతూ ఉంటే వారు ఇదే సమస్యకు గురవుతారు. ఎప్పుడు ఏదో ఒక ఆవేదనతో ఉండేవారు సైతం ఇలాంటి సమస్యకు గురవుతారు. ఈ పరిస్థితి ఆడవారిలో తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పురుషుల్లో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని పురుషులు దాచుకోగలుగుతారు. అందుకే లోలోపల ఎమోషన్ ఎక్కువగా ఫీల్ అయ్యి గుండె నొప్పికి దారితీస్తుంది. కానీ మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రక్షిస్తుంది. ఈ హార్మోన్ మహిళలు స్ట్రెస్ కు ఫీలైన గుండెపై ప్రభావం చెందకుండా కాపాడుతుంది. ఇలా పురుషుల్లో మాత్రమే ఈ సమస్య ఉండి.. మహిళల్లో తక్కువగా ఉంటుంది.
అయితే ఇటీవల దీనిపై అవగాహన పెంచేందుకు చాలామంది వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మగవారు స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు రిలాక్స్ కోసం ఏదైనా పనులు చేయాలని చెబుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు పెద్దగా ఆలోచించకుండా.. అవసరమైన విషయాలను మాత్రమే పట్టించుకోవాలని అంటున్నారు. అయితే కొంతమంది మహిళల్లోనూ విపరీతంగా ఆలోచన ఉండడంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.