Healthy Hair Tips: జుట్టు తెల్లబడటం, రాలిపోవడం ఈ రోజుల్లో కామన్ గా అయిపోయింది. చిన్న వయసులోనే ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వయసు పైబడిన తరువాత ఈ సమస్యలు వస్తే ఓకే కానీ యువతలోనే ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడుతూ డబ్బులు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. దీంతో జుట్టు సమస్యతో సతమతమవుతున్నారు.
మనం కూరల్లో ప్రతిరోజు కరివేపాకు వేస్తుంటాం. దీంతో కూరలకు మంచి రుచి వస్తుంది. కానీ కరివేపాకుతో జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. ఒక కప్పు కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులను వేసి పొయ్యి మీద పెట్టి ఆకులను బాగా వేగించాలి. తరువాత పొయ్యి మీద నుంచి దించి నూనెను వడకట్టాలి.
ఈ నూనె సుమారు నెల రోజుల పాటు నిలువ ఉంచుకోవచ్చు. దీన్ని ప్రతిరోజు జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య లేకుండా పోతాయి. కరివేపాకుతో జుట్టు రాలే సమస్యకు మంచి ఫలితం వస్తుంది. కరివేపాకులో ప్రొటీన్, బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు సమస్యను పరిష్కరిస్తుంది. జుట్టురాలే, తెల్లబడే సమస్యలకు తక్షణ పరిష్కారం కరివేపాకే అని తెలుస్తోంది.
జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ఇది సాయపడుతుంది. జుట్టు కుదుళ్లు బాగా కావడానికి పరోక్షంగా సహకరిస్తుంది. నెత్తి మీద తేమ, చనిపోయిన జుట్టు కుదుళ్లను తొలగిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు ఎంతో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని అందరు పాటించి జుట్టు సమస్యను దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.