Health Care : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. వ్యక్తిగత పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఈ విషయాన్ని పిల్లలకు చెబుతారు చాలామంది. కానీ కొందరు పెద్దవారు పరిశుభ్రతను పాటించడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్యాలకు గురై అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగని కొందరు అతిగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మాటిమాటికి చేతులు కడగడం.. లేదా పదేపదే మొహాన్ని కడుక్కోవడం వంటివి చేస్తుంటారు. ఏదైనా అతిగా చేస్తే ప్రమాదమే అన్నట్లు.. అతిగా పరిశుభ్రత పాటించడం కూడా ప్రమాదమే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శరీరంలోని 5 ప్రదేశాల్లో పదేపదే శుభ్రం చేసుకోవడం వల్ల సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంతకీ ఆ 5 ప్రదేశాలు ఏవంటే?
మొహం:
శరీరంలో మొహం చాలా సున్నితమైన ప్రదేశం. దీనిని ఎంత కాపాడుకుంటే అంతా అందంగా కనిపిస్తారు. అయితే కొందరు అందంగా ఉండాలని పదేపదే మొహాన్ని కడుక్కుంటూ ఉంటారు. ఇలా మొహం కడిగిన ప్రతిసారి సబ్బుతో మొహాన్ని రుద్దుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫేస్ రాస్ గా మారిపోతుంది. అంతేకాకుండా మొహాన్ని పదే పదే శుభ్రం చేయడం వల్ల చర్మంపై ఉన్న సహజ నూనెలు తొలగిపోయి మొటిమలు తయారవుతాయి. అందువల్ల మొహాన్ని ఎక్కువగా శుభ్రం చేయకుండా ఉండాలి.
చెవులు:
చెవుల్లో దుమ్ము ధూళి చేరి లోపల గులిమి తయారవుతుంది. ఇది శబ్దం వినడానికి అసౌకర్యంగా మారుతుంది. ఒక్కోసారి ఇందులోకి నీరు పోయి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి అప్పుడు ఎప్పటికప్పుడు చెవును శుభ్రం చేసుకోవాలని అంటారు. అయితే ఇందుకోసం ఇయర్ వాక్స్ ను వాడుతూ ఉంటారు. కానీ పదే పదే ఇయర్ వాక్స్ వాడడం వల్ల చెవులో కర్ణభేరి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
హెయిర్:
నిత్యం బయట తిరిగే వారిలో నెత్తిపై దుమ్ము ధూళి చేరుతుంది. దీనిని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా షాంపూ వాడుతూ ఉంటారు. అయితే వాస్తవానికి వారానికి రెండుసార్లు తలపై నీరు పోసి శుభ్రం చేయాలి. నాణ్యమైన షాంపును వాడాలి. కానీ పదే పదే తలను క్లీన్ చేసుకోవడానికి షాంపును ఎక్కువగా వాడడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. అయితే తలపై స్నానం చేసేవారు ఎక్కువగా షాంపు వాడకుండా ఉంటే మంచిది.
ముక్కు:
తలలోని సున్నితమైన ప్రదేశం ముక్కు. ముక్కు లోపల పలుసార్లు చెత్త చేరినప్పుడు దానిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అతిగా క్లీన్ చేయడం వల్ల లోపల సున్నితమైన ప్రదేశం దెబ్బతింటుంది. అంతేకాకుండా పదేపదే క్లీన్ చేయడం వల్ల ముక్కులో నుంచి బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
నడుము:
ఆరోగ్యకరమైన జీవితం ఉండాలంటే జీర్ణ క్రియ సక్రమంగా ఉండాలి. ఇందుకోసం నడుము భాగంలో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రయత్నించాలి. అయితే కొందరు పదేపదే నడుము వద్ద క్లీన్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో పొట్ట క్లీన్ కావడానికి అనేక పద్ధతులు పాటిస్తారు. ఇలా చేయడం వల్ల పెద్దపేగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా దెబ్బతింటుంది. అందువల్ల ఈ ప్రదేశంలో పదేపదే క్లీన్ చేయడం అంత మంచిది కాదు.