https://oktelugu.com/

Bhagini Hastha Bhojanam 2024: భగినీ హస్త భోజనం’ ఎలా చేస్తారు? ఈ పండుగ ఎలా వచ్చింది? 2024లో ఎప్పుడు జరుపుకుంటారు?

కొన్ని పండుగలు, పర్వదినాలకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. అలాగే భగినిహస్త భోజనం రావడానికి ఓ చరిత్ర ఉంది. యమధర్మరాజు చెల్లెలు యమున. వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 3, 2024 / 04:00 AM IST

    Bhagini Hastha Bhojanam 2024

    Follow us on

    Bhagini Hastha Bhojanam 2024: సాధారణంగా సోదరుడు, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు రాఖీ పండుగ నిర్వహిస్తారు. ఈరోజు సోదరుల ఇంటికి చెల్లెలు వెళ్లి రాఖీ కడుతుంది. ఈ సమయంలో తోబుట్టువులు సంతోషంగా ఉంటారు. కానీ వీరి మధ్య ప్రేమానుబంధాలు తెలిపేందుకు మరో ముఖ్యమైరన రోజు ఉంది. అదే ‘భగిని హస్త భోజనం’. దీపావళి తరువాత రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం అయిన తరువాత శుక్లపక్షం రోజున భగిని హస్త భోజనం వేడుకను నిర్వహించుకుంటారు. ఈ వేడుకలో భాగంగా సోదరులు తమ చెల్లెళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. తన ఇంటికి వచ్చిన సోదరులకు ఇష్టమైన వంటకాలు చేసి వారిని తృప్తి పరుస్తారు. ఆ తరువాత తమ చెల్లెళ్లను ఆశీర్వదిస్తారు. అయితే ఈ భగిని హస్త భోజనం వెనుక ఉన్న కథేంటీ?

    కొన్ని పండుగలు, పర్వదినాలకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. అలాగే భగినిహస్త భోజనం రావడానికి ఓ చరిత్ర ఉంది. యమధర్మరాజు చెల్లెలు యమున. వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లరు. అయితే శివభక్తుడైనా మార్కండేయ స్వామి ప్రాణం తీసుకునేందుకు యముడు యమపాశంతో వస్తాడు. ఈ సమయంలో మార్కండేయుడు శివ లింగాన్ని పట్టుకొని ఉండగా యముడు తన పాశాన్ని విసిరేస్తాడు. దీంతో ఆ పాశం శివలింగంపై పడతుంది. దీంతో శివుడు కోపోద్రిక్తుడుకావడంతో యముడు పారిపోతాడు.

    ఇలా యముడు పరుగులు పెడుతూ అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంట్లోకి వెళ్లి రక్షణ పొందుతాడు. దీంతో యముడిని చూసిన యమున ఎంతో సంతోషిస్తుంది. ఎంతో కాలంగా దూరంగా ఉన్న తన సోదరుడు ఇంటికి రావడంతో ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఆ తరువాత ఇష్టమైన వంటకాలు చేసి భోజనం పెడుతుంది. ఆ తరువాత ఎంతో తృప్తి చెందిన యముడు సంతోషంగా ఈరోజున ఏ చెల్లెలు అయితే తన సోదరుడికి ఇలా భోజనం పెడుతుందో ఆరోజు మృత్యు దోషాలు పోతాయని దీవిస్తాడు. అప్పటి నుంచి భగిని హస్త భోజనం చేస్తూ వస్తున్నారు.

    భగిని హస్త భోజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ప్రత్యేకంగా తిలకం తయారు చేసి తన సోదరులకు పెడుతారు. 2024 ఏడాదిలో నవంబర్ 3న నిర్వహించుకోనున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పండుగను యమ ద్వితీయ అని కూడా పిలుస్తారు. ఈరోజు కొందరు వ్యాపారస్తులు చిత్రగుప్తుడిని పూజిస్తారు. ప్రతీ ఏడాది కార్తీక మాసం శుక్లపక్షం రోజు దీనిని నిర్వహిస్తారు. నవంబర్ 3న ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు భగినిహస్త భోజనం నిర్వహించుకునేందుకు అనుకూల సమయం అని పండితులు చెబుతున్నారు.

    భగిని హస్త భోజనం వేడుకలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో సోదరులకు తిలకం దిద్దుతారు. ఒక పాత్రలో పండ్లు, పూలు వేసి ఉంచి అందులోనే అక్షింతలు పెట్టి సోదరుడికి నియమించిన సమయంలో తిలకం దిద్దుతుంది. ఆ తరువాత మణికట్టుకు ఎర్రటి దారం కడుతుంది. తిలకం పెట్టిన తరువాత సోదరుడిపై అక్షింతలు వేస్తారు. ఆ తరువాత అందరూ స్వీట్ తీసుకుంటారు.