Benefits Of Yoga: రోగాలను మన దరిదాపులకు రాకుండా చేసే శక్తి యోగాకి ఉంది. యోగా వల్ల ఎంత ఉపయోగమో అందరికీ తెలుసు. అయితే, యోగా గురించి తెలియని వారు కొందరైతే, నేర్చుకుని సరిగా ఆచరించని వారు కొందరు. మన పూర్వికులు ఆరోగ్యమే ‘మహాభాగ్యమని చెప్పారు, ఆ మాటకు యోగాలో ఎంతో విలువ ఉంది. యోగాలో ధ్యానము, యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు అన్నీ కలిస్తేనే యోగా అవుతుంది.

ఈ రోజుల్లో మనుషులు అన్ని రకాల వ్యసనాలకు బానిసలవుతున్నారు. రోగాలను ఆహ్వానిస్తున్నారు. డబ్బులు పెట్టి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రులకు లక్షల కొలది డబ్బు ఖర్చు పెడుతున్నారు. దీనికితోడు అసలు చెడు వ్యసనాలకు మాత్రం దూరం కాలేకపోతున్నారు. అయితే, డాక్టరు రోగాన్ని టెస్ట్‌లు చేసి తెలుసుకుని నయం చేయగలడు.
Also Read: డెల్టా, ఒమిక్రాన్ కలిసి మరో కొత్త వేరియంట్.. వినాశనం తప్పదా?
కానీ అసలు ఆ రోగాలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా యోగా ఆశ్రయిస్తే చాలు. రోగాలు మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఎందుకంటే యోగా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది, మనిషిని ఇటు శారీరకంగా మరియు అటు మానసికంగా కూడా యోగా సానుకూలంగా ప్రభావితం చేయగలదు. యోగా వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ వల్ల అవయవాల ఆరోగ్యం మరియు చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
పైగా యోగా శరీరంలో ఒత్తిడిని తగ్గించడం తో పాటు హాయిని కలిగిస్తోంది. అలాగే ఎప్పుడైనా శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ ఆయాసం వస్తూ ఉంటుంది. యోగాతో దాన్ని సక్రమంగా ఉండేలా చేయవచ్చు. అలాగే యోగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
Also Read: అసలు కరోనా వచ్చిందో లేదో ఎలా గుర్తించాలంటే? జాగ్రత్తలివీ!