AP Cabinet Expansion: ఏపీలో మరో రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీనిపై ఇప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ కారణంగానే ఆ పార్టీలో ప్రస్తుతం కాస్త ఆందోళన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు సగం మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవనే ప్రచారం కోడై కూస్తోంది.
తాజాగా వైసీపీ ఎల్పీ భేటీలో సీఎం కొత్త అంశాన్ని ప్రస్తావించారు. సర్వే లిస్టులో పాజిటివ్‌గా పేర్లు ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని కుండ బద్దలు కొట్టాడు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. వాస్తవానికి సర్వేలో వచ్చిన వ్యతిరేకత ప్రభుత్వంపైనా లేక ఎమ్మెల్యేలపైనా అనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ప్రభుత్వం పైన వ్యతిరేకత అనే ఆప్షన్ ఇవ్వరు. దీంతో ఆ నింద ఎమ్మెల్యేలపై పడుతుంది.
Also Read: Anand Mahindra: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రాకూడదంటే ప్రజల కోసం అభివృద్ధి పనులు చేపట్టాలి. అందులోనూ నిధుల కొరత లేకుండా చూసుకోవాలి. ఇలాంటి వాటి కోసం ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి. ప్రభుత్వం ఇలా ఇవ్వకుంటే ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్యేలపై ఉంటుంది. నిధుల ఇవ్వకపోవడం వల్ల చిన్న పనులను సైతం చేపట్టలేకపోయారు స్థానిక ఎమ్మెల్యేలు. తమ పార్టీ నేతలకు సైతం కాస్త ఆర్థికంగా భరోసా ఇవ్వలేకపోయారు. ఫలితంగా అసంతృప్తి పెరగడం కామనే..
ఇక వచ్చే ఎన్నికల్లో తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీ నుంచి బలమైన నాయకులు ఎవరూ బరిలో లేకుంటే టికెట్ రావడం పక్కా. ఇక ప్రత్యర్థులు బలమైన వారు ఉంటే ఆ స్థానంలో వైసీపీ తరపు నుంచి కొత్త వారికి టికెట్ వచ్చే చాన్స్ ఉంది. మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి టికెట్ దక్కుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి.
Also Read: చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?