Janasena-BJP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైగానే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచి వేడి రాజుకుంటోంది. పార్టీల పొత్తు, సీట్లు వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. వైసీపీ పార్టీని అధికారం నుంచి దింపేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యే చాన్స్ ఉంది. కానీ ఎన్నికల సమయానికి బీజేపీ, జనసేన విడిపోయేలా అవకాశాలున్నాయి. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ పలు అంశాలు ప్రస్తావించారు. కానీ బీజేపీ పేరును మాత్రం ఎక్కడా చెప్పలేదు.
వైసీపీని ఓడించాలని అందుకు అందరూ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వచ్చే వారితోనే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు పవన్. ఈ లెక్కన టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ టీడీపీతో పొత్తు కోసం బీజేపీ ఒప్పుకోవడం లేదు. దీంతో జనసేన, బీజేపీ వీడిపోయే చాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.
Also Read: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..
రాష్ట్ర సమస్యలపై కలిసి పోరాడుతామని గతంలో జనసేన, బీజేపీ మీడియా ముందు చెప్పుకొచ్చాయి. కానీ తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసేందుకు తమ పార్టీ సిద్ధమవుతోందని వెల్లడించారు. దీనిని బట్టి చేస్తే జనసేనతో కాకుండా బీజేపీ మాత్రమే ఒంటరిగా పాదయాత్రను చేపట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా మరో వైపు ఎలాగైన వైసీపీని ఓడించేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం పవన్ వెయిట్ చేస్తున్నట్టు టాక్.
పవన్ తమను పట్టించుకోవడం లేదని ఏకంగా మ్యానిఫెస్టో కూడా ప్రకటించారని జనసేనపై బీజేపీ గుర్రుగా ఉంది. మరి పవన్ సపోర్ట్ లేకుండా ఏపీలో బీజేపీ ఏం సాధిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో కాస్త ఊపు ఉన్నా ఏపీలో ఆ పార్టీకి క్యాడర్ లేదు. బలం కూడా లేదు. మరి ఈ టైంలో పొత్తు లేకుండా సింగిల్ గా ఆ పార్టీ ప్రజల్లోకి వెళితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?