Walking Benefits: శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.

అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులు అయితే ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు వాకింగ్ పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
Also Read: మహిళలలో ఉండకూడని లక్షణాలు ఇవే… ఇలాంటి వారితో స్నేహం నరకమే: చాణక్య నీతి
వాకింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా వాకింగ్ చేస్తే జనసంచారం ఎక్కువగా ఉండటంతో విషవాయువులు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఆరోగ్యం సంగతి అటుంచితే అనారోగ్యం బారిన పడే అవకాశముంది. శరీరంలో డి విటమిన్ తక్కువగా ఉండేవారు ఉదయం 8 గంటల లోపు ఎండలో నిలబడాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. ఉదయం కుదరని వారు సాయంత్రం 5 గంటల తర్వాత ఎండలో నిలబడొచ్చు. కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం వాకింగ్ చేస్తారు.

రోజూ నిర్ధారిత సమయంలో నడవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు… అంటే సుమారు 2.5 గంటలు వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోండి. నడవమన్నారు కదా అని బద్దకంగా అడుగులు వేయకండి. వీలైనంత చురుగ్గా శరీరం మొత్తం కదిలేలా వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. వాకింగ్ ప్రతిరోజూ చేయాలి. ఒకరోజు కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. వర్షాల కారణంగా లేదా ఇతర కారణాల వల్ల బయట వాకింగ్ చేయడం కుదరకపోతే.. ఇంట్లోనే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి.
Also Read: కొత్త జిల్లాలపై వివాదాలు ముగిసేనా? ఎన్టీఆర్ పేరు ఉంచుతారా? అభ్యంతరాలివీ?
Recommended Video:

[…] […]
[…] Marriage After 30 Years: పెండ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో కచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. అయితే ఈ పెండ్లి విషయంలో కాలాన్ని బట్టి చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పటి యువత చాలా వరకు 30ఏండ్ల తర్వాతే పెండ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా 30 తర్వాత చేసుకునే వారికి చాలా సమస్యలు వస్తాయంట. ఎందుకంటే ఆ వయసు దాకా చేసుకోకపోతే వారిలో ఎవరి అభిప్రాయాలకు వారే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారట. […]
[…] Madhya Pradesh: పెండ్లి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని సన్నివేశం. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమకు కాబోయే వాడికోసం ఎన్నో కలలు కంటారు. కాగా ఈ నడుమ పెండ్లిలో ఊహించని సంఘలను కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటి విచిత్రమే జరిగింది. ఆ అమ్మాయి కోటి కలలతో పెండ్లికి సిద్ధం అయితే చివరకు ఊహించని మలుపు చోటుచేసుకుంది. […]