Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి ఉన్న హోదా ఎలాంటిదో తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పోస్టుకు ఉన్న ప్రాధాన్యత ఏపాటిదో అర్థమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల జోరు కూడా కొనసాగుతోంది. టీటీడీ ఈవోగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పరిణామాల తీరుపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
టీటీడీ ఈవో పోస్టు కావాలని పల్టుబట్టి మరీ సాధించుకున్నారు. కరోనా కాలంలో ఈవో తోపాటు కరోనా సేవలు కూడా చూశారు. దీంతో ప్రభుత్వంలో ఆయన ప్రత్యేక స్థానం కల్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు చెబుతున్నారు. జగన్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా జవహర్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేయనున్నారు.
Also Read: బడ్జెట్ లేదు.. గిడ్జెట్ లేదు.. 94 వేల కోట్లు ఏమైపోయాయబ్బా?
జవహర్ రెడ్డి మాటంటే అందరికి వేదమే. ఆయన చెబితే ఎంతటి అధికారి అయినా తల వంచాల్సిందే. దీంతో జవహర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. పనులు చకచకా కావాలంటే ఆయన హుకుం జారీ చేస్తే అంతే సంగతి. ఎంతటి పని అయినా ఇట్టే జరిగిపోవాలి. ఎంత స్థాయిలో ఉన్న అధికారి అయినా సలాం కొట్టాల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో జవహర్ రెడ్డి హవా మరింత రెట్టింపవుతుందని తెలుస్తోంది.
\
కరోనా సమయంలో జవహర్ రెడ్డి వ్యవహరించిన తీరుతో అందరికి దగ్గరివాడైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ నిర్వహణలో ఆయన అందరితో పరిచయాలు పెరిగాయి. దీంతో అధికారులను తన వైపు తిప్పుకున్నారు. ఏ పని కావాలన్నా చిటికెలో చేసి పెట్టగల సామర్థ్యం ఉండటంతో జవహర్ రెడ్డి పాత్రపై అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా కూడా కొనసాగుతూ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: కొత్త జిల్లాలపై వివాదాలు ముగిసేనా? ఎన్టీఆర్ పేరు ఉంచుతారా? అభ్యంతరాలివీ?
Recommended Video: