Health Benefits Of Corn: ఏ సీజన్ లో దొరికే పండ్లు, కాయలు ఆ సీజన్ లోనే తినాలి. అలాగయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యానికి రక్షణ చేకూరుతుంది. ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే వాటిలో మొక్కజొన్న పొత్తులు ప్రధానమనవి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే పూర్వం రోజుల్లో వీటిని తినడం వల్లే మన పూర్వీకులు మంచి ఆరోగ్యంతో ఉన్న సంగతి తెలిసిందే. మనం కూడా వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మొక్కజొన్న కంకులు విరివిగా దొరుకుతున్నాయి. వీటిని తీసుకుని మనం కాల్చుకుని తినొచ్చు. లేదా ఉడకబెట్టుకుని కూడా తింటే ఆకలి తీరుతుంది. తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది.

దీంతో పాప్ కార్న్, స్వీట్ కార్న్ గా మనం ఆహారంగా తీసుకుంటాం. మొక్కజొన్న రొట్టె కూడా బాగుంటుంది. మొక్కజొన్న గింజల నుంచి నూనె కూడా తీస్తారు. మొక్కజొన్న తో మనకు ఎన్నో లాభాలున్నాయి. దీంతో మొక్కజొన్న తో చేసుకునే ఆహార పదార్థాలతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలకు అవసరమైన లవణాలు, మినరల్స్ పుష్కలంగా ఇందులో ఉన్నాయి. మెగ్నిషియం, ఐరన్, కాపర్, పాస్పరస్ వంటివి ఉండటంతో ఎముకలకు బలాన్నిస్తాయి. దీంతో మొక్కొజొన్న పదార్థాలు తీసుకోవడం మంచిదే అని గ్రహించుకోవాలి.
Also Read: Vice Presidential Election -TRS: ‘మార్గరెట్’కే టీఆర్‌ఎస్ మద్దతు.. చివరి నిమిషంలో నిర్ణయం!
మొక్కజొన్న జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం అరిగేందుకు తోడ్పడుతుంది. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. మలబద్ధకం సమస్య ఎక్కువైతే మొలల బాధ వస్తుంది. అర్షమొలలు ఉంటే కష్టమే. ఎక్కువ సేపు కూర్చోలేం. అందుకే మొక్కజొన్నను ఆహారంగా తీసుకుంటే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. మంచి ఆహారాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

మొక్కజొన్నలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనతను నివారిస్తుంది. ఐరన్ లోపంతో రక్తకణాల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో మనకు అనారోగ్యం కలుగుతుంది. పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటంతో రక్తహీనత రాకుండా చేస్తుంది. మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని గ్రహించుకోవాలి. మొక్కజొన్నను ఆహారంగా తీసుకుంటే మనకు ఎన్నో విధాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో మొక్కజొన్న ను విరివిగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.
Also Read:Bendapudi Students: అమెరికా యాసలో దంచేసిన బెండపూడి విద్యార్థులు..ట్రోలింగ్ ను ఎదిరించి నిలిచారు