Vice Presidential Election- TRS: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయమై ఇన్నాళ్లూ నాన్చుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు కొద్ది గంటలకు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించింది. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు తమ పార్టీ ఎంపీలు ఓటు వేస్తారని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో విపక్షాలకు కాస్త ఊరట లభించింది.

విమర్శలకు భయపడే..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్గరెట్ అల్వాను ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఎంసీ తరఫున యశ్వంత్ సిన్హాను బరిలో నిలిపారు. అందుకుముందు ఇద్దరు అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. వారు పోటీకి అంగీకరించకపోవడంతో చివరకు యశ్వంత్‌సిన్హాను ఖరారు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వచ్చే సరికి ఎలాంటి జాప్యం చేయకుండా శరద్‌పవార్ కాంగ్రెస్ నేత మార్గరెట్ అల్వాను ప్రకటించారు. ఇక ఎన్డీయే పశ్చిమబెంగాల్ గవర్నర్ ధడ్కన్‌ను బరిలో నిలిపింది.
Also Read: Jithender Reddy- Etela Rajender: జితేందర్ రెడ్డి ఈటల రాజేందర్ పైనే బిజెపి ఆశలు
విపక్ష అభ్యర్థికి మద్దతు విషయంతో తర్జన భర్జన..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతులో టీఎంసీ, టీఆర్‌ఎస్ కీలకం. టీఎంసీ మొదట అల్వాకు మద్దతు ఇవ్వమని ప్రకటించి షాక్ ఇచ్చింది. దీంతో రంగలోకి దిగిన శరద్‌పవార్ మమతాబెనర్జీతో మంతనాలు జరిపారు. విపక్షాలు చీలిపోతే అధికార ఎన్డీఏ మరింత బలపడుతుందని చెప్పడంతో దీదీ మెత్తబడ్డారు. మార్గరెట్‌కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఎన్నికలకు ముందురోజు టీఆర్‌ఎస్ నిర్ణయం..
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి కాంగ్రెస్ నేత కావడమే ఇందుకు కారణం. మద్దతు ఇస్తే కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు బీజేపీ ప్రచారం చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావించారు. మద్దతు ఇవ్వకుండా తటస్తంగా ఉంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి, 16 మంది ఎంపీల బలం ఉన్నా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎవరికి మద్దతు ఇవ్వలేకపోయిందన్న అపవాదు మూటగట్టుకునే అవకాశం ఉంది. ఈమేరకు బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనేక తర్జన భర్జనల నడుమ ఉపరాష్త్రపతి ఎన్నికలకు ఒక్కరోజు ముందు గులాబీ అధినేత కేసీఆర్ విపక్షాల అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

విమర్శలను తిప్పికొట్టేందుకు అస్త్రం..
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అయినా గులాబీ బాస్ కాంగ్రెస నేత అయిన మార్గరెటకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో బీజేపీతోపాటు ఎన్డీఏ పక్ష నాయకులు నుంచి కూడా విమర్శలు తప్పవు. కానీ కేసీఆర్ వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అందుకే చివరి నిమిషం వరకూ నాన్చుతూ వచ్చారని సమాచారం. కాంగ్రెస్ నేతకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ ఆ పార్టీలు రెండూ ఒక్కటే అన్న విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈనేపథ్యంలో వాటిని గులాబీ బాస్ ఎలా తిప్పికొడతారు.. ఆయన దగ్గర ఉన్న అస్త్రం ఏమిటన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.
Also Read:Munugodu By Election: మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ
[…] Also Read: Vice Presidential Election -TRS: ‘మార్గరెట్’కే టీఆర్ఎస… […]
[…] Also Read: Vice Presidential Election -TRS: ‘మార్గరెట్’కే టీఆర్ఎస… […]