https://oktelugu.com/

Naga Chaitanya- Samantha: సమంతతో విడాకులపై మరోసారి నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya- Samantha: సమంత-నాగచైతన్య అసలు ఎందుకు విడిపోయారు? దానికి కారణమేంటి? అన్నది ఎవ్వరికీ తెలియదు. వారిద్దరూ విడాకుల ప్రకటన చేశాక.. ఎవరికి తోచినట్టు వారు రాసుకుంటున్నారు. దీనిపై సమంత, నాగచైతన్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సమంత చాలా సార్లు ఈ విషయంలో బరెస్ట్ అయినా.. నాగచైతన్య మాత్రం సాఫ్ట్ గా స్పందిస్తున్నారు. తాజాగా మరోసారి నాగచైతన్య తమ వివాహబంధం గురించి బయటపడ్డారు. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న […]

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2022 / 09:06 AM IST
    Follow us on

    Naga Chaitanya- Samantha: సమంత-నాగచైతన్య అసలు ఎందుకు విడిపోయారు? దానికి కారణమేంటి? అన్నది ఎవ్వరికీ తెలియదు. వారిద్దరూ విడాకుల ప్రకటన చేశాక.. ఎవరికి తోచినట్టు వారు రాసుకుంటున్నారు. దీనిపై సమంత, నాగచైతన్యను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సమంత చాలా సార్లు ఈ విషయంలో బరెస్ట్ అయినా.. నాగచైతన్య మాత్రం సాఫ్ట్ గా స్పందిస్తున్నారు. తాజాగా మరోసారి నాగచైతన్య తమ వివాహబంధం గురించి బయటపడ్డారు.

    Naga Chaitanya- Samantha

    బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో మన యంగ్ హీరో నాగచైతన్య చేశాడు.ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు.

    Also Read: Kiara Advani: పెళ్ళైన స్టార్ హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేసిన కైరా అద్వానీ

    నాగచైతన్య ఎక్కడ ఇంటర్వ్యూకు వెళ్లినా మొదట ఎదురయ్యే ప్రశ్న.. ‘సమంతతో విడాకుల విషయం’. అందుకే ఇక దీన్ని తప్పించుకోకూడదని నాగచైతన్య డిసైడ్ అయ్యాడు. మరోసారి సమంతతో విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. విడాకులు తీసుకున్న తర్వాత తనపై, సమంత గురించి వస్తున్న వార్తలపై చైతన్న క్లారిటీ ఇచ్చాడు. ‘మేమిద్దరం మా స్టేట్ మెంట్స్ ఇచ్చామని.. మాకు ఒకరిపై మరొకరికి అమితమైన గౌరవం ఉంది. ఎప్పుడూ ఆమెపై గొప్ప గౌరవం ఉంది. మా గురించి మేము మా వద్ద ఉన్నదే చెప్పామని.. కానీ అంతకుమించి మా మధ్య ఉన్న దాన్ని పూరించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. మా గురించి వస్తున్న వార్తలు చూసి విసుగు చెందాను’ అని నాగచైతన్య కాస్త అసహనం వ్యక్తం చేశారు.

    Naga Chaitanya- Samantha

    నాలుగేళ్ల వివాహ బంధానికి గత ఏడాది అక్టోబర్ 2న ముగింపు పలికారు చైతన్య-సమంత.. తామిద్దరం విడిపోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    విడాకులతో వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు.. వృత్తిపరమైన జీవితంలో ఇబ్బందులు పడడంపై కూడా నాగచైతన్య స్పందించాడు. రెండు బ్యాలెన్స్ చేస్తున్నా కాబట్టే తాను ప్రశాంతంగా ఉన్నానని నాగచైతన్య తెలిపారు. రెండింటి మధ్య ఒక రేఖను గీయాలని.. చిత్తశుద్ధితో చేసే పని మనల్ని ఎప్పుడూ బాగుపరుస్తుందని అనుకుంటున్నట్టు తెలిపారు. వార్తలను వార్తలే భర్తీ చేస్తాయి. ఇవాళ ఒకటి.. రేపు మరొకటి.. అందుకే మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీదే దృష్టి పెట్టాలని నాగచైతన్య హితవు పలికారు. ఇప్పటికే మా ఇద్దరి గురించి వార్తలు చూసి విసుగు చెందానని నాగచైతన్య అన్నారు.

    Also Read:Anasuya Bharadwaj: ‘సరసాలు చాలు’ అంటూ అనసూయ విరహ గానం.. తట్టుకోవడం కష్టమే?

    Tags