Vasthu Tips : ఇంట్లో ఈ వస్తువులు ఉండడం వల్ల వద్దన్నా డబ్బు.. అయితే ఈ నియమం పాటించాలి.. 

సాధారణంగా వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మాణం చేసుకుంటాం. అలాగే ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేసే చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ చీపురును ఈశాన్యంలో అస్సలు ఉంచొద్దని అంటారు. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటో మరొక వస్తువును ఇంట్లో ఉంచుకోవాలి

Written By: Srinivas, Updated On : July 31, 2024 4:31 pm
Follow us on

Vasthu Tips : నేటి ఆధునిక ప్రపంచంలో డబ్బు లేనిదీ ఏ పని జరగదు. ప్రతీ అవసరానికి ధనం తప్పనిసరి కావాలి. ఈ డబ్బు సంపాదించడానికి మనుషులు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. ఈ తరుణంలో కొందరి వద్ద అధికంగా..మరికొందరి వద్ద తక్కువగా ఉంటుంది. కొందరు జీవితాంతం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ అనుకున్న డబ్బు సంపాదించలేదు. వారు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా.. ఏదో రకంగా ఖర్చు అవుతుంది. మరికొందరు ఎక్కువ డబ్బు సంపాదించినా… అంతకుమించి ఖర్చులు చేస్తారు. దీంతో ఇంట్లో డబ్బు నిల్వదు. ఫలితంగా అత్యవసర సమయంలో ఇతరులను అప్పుడ అడగాల్సి వస్తుంది. ఇలా చాలా మంది  డబ్బు ఉన్నా.. లేకున్నా..రకరకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఒక ఇంట్లో ఫైనాన్స్  ప్రాబ్లమ్ ఉందంటే అందుకు కారణం కుటుంబ పెద్ద సరైన విధంగా ఆర్థిక ప్రణాళిక చేపట్టకపోవడం. మరొకటి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండడం. రెండో విషయానికి వస్తే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఎంత డబ్బు సంపాదించినా.. అత్యవసర సమయానికి డబ్బు దొరకదు. ఏదో రకంగా ఖర్చు అవుతూనే ఉంటాయి. అసలు విషయం తెలుసుకోలేక ఆందోళన చెందుతారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఎన్ని ఖర్చులు అయినా.. అత్యవసరానికి డబ్బు అందుతుంది. అయితే డబ్బు నిల్వ ఉండడానికి అవసరమైన ఆ వస్తువులు ఏవి? వాటిని ఏ ప్రదేశంలో ఉంచాలి? ఆ వివరాల్లోకి వెళ్తాం పదండి..
సాధారణంగా వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మాణం చేసుకుంటాం. అలాగే ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా వాస్తు ప్రకారం అమర్చుకోవాలి. ఉదాహరణకు ఇంటిని శుభ్రం చేసే చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ చీపురును ఈశాన్యంలో అస్సలు ఉంచొద్దని అంటారు. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావాలంటో మరొక వస్తువును ఇంట్లో ఉంచుకోవాలి. అదే శంఖం. శంఖం గురించి చాలా మంది వింటుంటారు. కానీ దీనిని ఇంట్లోకి తీసుకురావాలని ఎవరూ అనుకోరు. అయితే శంఖం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంట్లో సంతోష వాతావరణాన్ని అందిస్తుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలను తొలగిస్తుంది. అందువల్ల సముద్రంలో దొరికే శంఖాన్ని తీసుకొని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ శంఖాన్ని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు సంతోషంగా మారుతుంది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నంను అన్నపూర్ణాదేవితో పోలుస్తారు. అందువల్ల ఇంట్లో అన్నం ఎప్పుడూ నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఇక అన్నం వండే పాత్రలను ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు. ఒకవేళ అన్నం పూర్తిగా అయిపోతే అందులో కొన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా నీరు పోసిన పాత్రలను మాత్రమే ఉంచాలి. అన్నం వండే పాత్రలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఈ పాత్రలు ఖాళీగా ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. దీంతో ఆ ఇంట్లో ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది.
ఇంట్లో ఉండే వాష్ రూం ను వాస్తు ప్రకారమే నిర్మించుకుంటాం. అయితే వాష్ రూంలో ఉండే బకెట్లు ఎప్పడూ నీటితో ఉంచాలి. ఇందులో నీళ్లు లేకపోవడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుందని చెబుతున్నారు. అందువల్ల వాష్ రూంలో ఉండే బకెట్లు ఎప్పుడూ నీటితో నిండి ఉంచాలని చెబుతుంది. ఇలా ఇంట్లోని కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది. లేకుంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు.