Mudra Loan : ముద్ర లోన్’లో భారీ మార్పులు.. వారికి రూ.20 లక్షల లోన్.. వెంటనే త్వరపడండి..

కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ ద్వారా రూ. 10 లక్షల వరకు రుణ సాయం పొందవచ్చు. వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలు ఈ లోన్ కు అర్హులు. వ్యవసాయంలో తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, డైరీ వంటి వాటి కోసం రుణం పొందవచ్చు. వ్యవసాయేతర రంగాల్లో కూరగాయల విక్రయదారులు, ఆహార సేవ యూనిట్లు, మరమ్మతు దుకాణాలు, చేతి వృత్తుల వారు, మెషిన్ ఆపరేటర్లు, తదితర చిన పరిశ్రమల కోసం లోన్ తీసుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : July 31, 2024 4:16 pm
Follow us on

Mudra Loan : ప్రతీ వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి చెందాలని అనుకుంటాడు. దీంతో వివిధ రంగాల ద్వారా తన పనులు చేసుకుంటూ ఆదాయాన్ని ఆర్జిస్తారు. డబ్బు సంపాదించడానికి వ్యక్తులు ప్రధానంగా రెండు మార్గాలను ఎంచుకుంటారు. వీటిలో ఒకటి ఉద్యోగ రంగం…మరొకటి వ్యాపార రంగం..ఒక సంస్థ లేదా ఒక కంపెనీ లో వారు నిర్ణయించిన ఆదేశాల మేరకు పనులు చేస్తూ జీతం తీసుకుంటారు. అదే వ్యాపార రంగానికి చెందిన వారు సొంతంగా పెట్టుబుడి పెట్టి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టడానికి కొంచెం ధైర్యం కావాలి. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులకు లాభం రావొచ్చు.. లేదా నష్టం ఏర్పడొచ్చు.. మరోవైపు వ్యాపారం చేయడానికి మూలధనం కావాలి. కొందరికి వ్యాపారం చేయాలని ఉత్సాహం ఉన్నా సరైన డబ్బు ఉండదు. దీంతో బ్యాంకుల ద్వారా లేదా ఇతర సంస్థల ద్వారా రుణం తీసుకుంటారు. అయితే వ్యాపార రంగాన్ని ప్రోత్సహించేందకు కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తుంది. అదే ముద్ర లోన్. ముద్ర లోన్ ద్వారా వ్యాపారులు రుణ సాయం పొందవచ్చు. నిన్నటి వరకు ముద్ర లోన్ ద్వారా రూ. 10 లక్షల వకు లోన్ అందించారు. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో కొందరు వ్యాపారస్తులకు ఇది లాభం చేకూరనుంది. అయితే ఈ పెంచిన మొత్తం కొందరికి మాత్రమే వర్తిస్తుంది. అయితే అది ఎవరికి వర్తిస్తుంది? ఇంతకీ ఎంత వరకు రుణ సాయం పెంచారు? ఆ వివరాల్లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ ద్వారా రూ. 10 లక్షల వరకు రుణ సాయం పొందవచ్చు. వ్యవసాయం, వ్యవసాయేతర రంగాలు ఈ లోన్ కు అర్హులు. వ్యవసాయంలో తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, డైరీ వంటి వాటి కోసం రుణం పొందవచ్చు. వ్యవసాయేతర రంగాల్లో కూరగాయల విక్రయదారులు, ఆహార సేవ యూనిట్లు, మరమ్మతు దుకాణాలు, చేతి వృత్తుల వారు, మెషిన్ ఆపరేటర్లు, తదితర చిన పరిశ్రమల కోసం లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ ను బ్యాంకు ద్వారా అందిస్తారు. అయితే లోన్ కోసం సంబంధిత దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను పరిశీలించిన తరువాతనే రుణ సాయం చేస్తారు.

అయితే ముద్ర లోన్ పరిమితిని ఇటీవల పెంచారు. ఇప్పటి వరకు ఉన్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అయితే రూ. 20 లక్షలు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముద్ర లోన్ ను మూడు రకాలుగా అందిస్తారు. వీటిలో ఒకటి శిశు, కిశోర్, తరుణ్ అనే విభాగాలు ఉంటాయి. రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే దీనిని శిశు లోన్ అంటారు. రూ.50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ వస్తే దానిని కిశోర్ లోన్ అంటారు. అదే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ పొందుతారో దానిని తరుణ్ లోన్ అని అంటారు.

ఎవరైతే తరుణ్ లోన్ తీసుకొని దానిని సక్రమంగా చెల్లిస్తారో.. ఎటువంటి ఈఎంఐ లేకుండా చెల్లిస్తారో.. వారికి రూ. 20 లక్షల పరిమితికి అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే రూ.20 లక్షల రుణసాయం పొందుతారు. అంటే ఇప్పటి వరకు ముద్ర లోన్ తీసుకొని సక్రమంగా చెల్లించిన మరో లోన్ కోసం అప్లయ్ చేస్తారో.. వారికి రూ. 20 లక్షల స్కీం వర్తిస్తుంది. ముద్ర లోన్ తీసుకునే ముందు ఈ విషయాన్ని గ్రహించుకోవాలి.