Little Hearts Collection: ఈ ఏడాది అతి చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకొని, ఆ సినిమా వ్యాపారం లో ఉన్న ప్రతీ ఒక్కరికి పెట్టిన పైసాకు పదింతలు ఎక్కువ లాభాలను చూపించిన చిత్రాల్లో ఒకటి ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie). ప్రముఖ యూట్యూబర్ మరియు స్టాండప్ కమెడియన్ మౌళి(Mouli Talks) హీరో గా నటించిన చిత్రమిది. ఎలాంటి చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 12న ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ చిత్రాలు విడుదలై సూపర్ హిట్ టాక్స్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్నాయి. ఈ రెండు సినిమాల ప్రభావం ‘లిటిల్ హార్ట్స్’ మీద పడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇసుమంత ప్రభావం కూడా చూపించలేకపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 9 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి విడుదలకు ముందు మూడు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మాత్రమే ఈ చిత్రానికి జరిగింది. కానీ కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 9 రోజుల్లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణంగా విషయం కాదు. ప్రాంతాల వారీగా చూస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో 97 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర లో 5 కోట్ల రూపాయిల సహాయ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 15 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రం స్టడీ రన్ ని చూసి ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ ని పరిశీలిస్తున్న ట్రేడ్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారట. ముఖ్యంగా రెండవ శనివారం రోజున ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో 70 వేల డాలర్లు వచ్చాయట. చూస్తుంటే నార్త్ అమెరికా లో ఈ చిత్రం కచ్చితంగా ఫున్ రన్ లో 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఊరు పేరు తెలియని ఒక చిన్న హీరో సినిమాకు ఇంతటి గ్రాస్ వసూళ్లు వస్తే, ఇక పెద్ద హీరోలు సరైన కంటెంట్ తో సినిమాలు తీస్తే ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు జరుగుతాయో అని ట్రేడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.