Mirror : ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. వింత వింత వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే మన నిత్యం చేసే కొన్ని అలవాట్లు కూడా వ్యాధుల వల్లనే కావచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువగా మాట్లాడటం, తినడం, లేదంటే పూర్తిగా తక్కువ తినడం, మౌనంగా ఉండటం వంటివి కూడా కొన్ని వ్యాధుల వల్లనే సంభవిస్తాయట. అయితే ఇప్పుడు మరో ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకుందాం.
మీకు రోజుకు చాలాసార్లు అద్దం చూసుకునే అలవాటు ఉందా? అంటే మీకు మిర్రర్ చెకింగ్ సమస్యతో బాధ పడుతున్నట్టే. దీని కారణంగా మీ ప్రవర్తన కూడా ప్రభావితమవుతుంది. ఇది మీ శరీర డైస్మోర్ఫిక్ డిజార్డర్ (BDD)కి సంబంధించినది. ఇదొక రకమైన మానసిక ఆరోగ్య సమస్య అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిలో మీరు మీ గుర్తింపు గురించి తరచుగా టెన్షన్‌లో ఉంటారన్నమాట. అంతేకాదు అద్దంలో చూసుకోవడం వల్ల మీ లోపాలను మీరు తెలుసుకోవాలి అని నిత్యం ప్రయత్నిస్తారట.
పరిశోధన ప్రకారం
అద్దాన్ని పదే పదే చూడటం అనేది ఒక నిర్దిష్ట రకమైన రుగ్మతకు సంబంధించినది. ప్రొఫెసర్, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలోని JN మెడికల్ కాలేజీ సైకాలజీ విభాగం చైర్మన్ SA అజ్మీ ప్రకారం, మీరు మీ శరీరాన్ని పదేపదే అద్దంలో చూసుకుంటే, అది మీ మెదడుకు సంబంధించిన మానసిక అనారోగ్యం కావచ్చు అంటున్నారు. ఈ వ్యాధిని OCD స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. కొంతమంది తమ చర్మాన్ని అద్దంలో పదే పదే చూసుకుంటూ వింత వింత చేష్టలు చేస్తుంటారు. బుగ్గలు నిమురుకోవడం, జుట్టును పదే పదే సర్దుకోవడం, కండ్లను చూసుకోవడం వంటి పనులను పదే పదే చేస్తారు. ఇక కొందరు ఏకంగా తమను తాము చూసుకుంటూ చిటికెలు కూడా వేస్తారు. ఇలాంటివి అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన రుగ్మత అంటున్నారు నిపుణులు.
పదే పదే అద్దం చూసుకోవడం ఈ వ్యాధి లక్షణం.
అద్దాన్ని పదే పదే చూసుకోవడం ద్వారా, ప్రతికూల ఆలోచన తనలో ఏర్పడటం ప్రారంభిస్తుందట. ఇది మానసిక అనారోగ్య రూపాన్ని తీసుకుంటుంది అంటున్నారు నిపుణులు. అలాంటి వ్యక్తులు క్రమంగా సమాజానికి దూరమవుతారు. వారు పాఠశాలకు వెళ్లడం తగ్గించవచ్చు, పార్టీలకు వెళ్లకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువట. క్రమంగా కుటుంబం, స్నేహితుల నుంచి కూడా దూరం పాటించే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి అనేక శారీరక లోపాలున్నాయని వారు భావిస్తారు. కొన్నిసార్లు ఈ రుగ్మత చాలా తీవ్రంగా మారుతుంది. ప్రజలు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకునే అవకాశం ఉంది. gstatic ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.