spot_img
HomeజాతీయంChildren`s Day 2022 : చిల్డ్రన్స్ డే.. జవహర్ లాల్ నెహ్రూ జయంతి.. ఈ రెండు...

Children`s Day 2022 : చిల్డ్రన్స్ డే.. జవహర్ లాల్ నెహ్రూ జయంతి.. ఈ రెండు పండుగలకు లింకేంటో తెలుసా?

Children`s Day 2022 : నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచంలోని దేశాలన్ని నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటాయి. మన దేశం మాత్రం ఆరు రోజులు ముందుగానే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటుంది? ఇందులో ఉండే విశిష్టత ఏంటి? అనే కారణాలు తెలుసుకోవాలి. నవంబర్ 14 మన మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు కావడం తెలిసిందే. దీంతో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్ని నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటుంటే మన దేశం మాత్రం జవహర్ లాల్ జయంతినే బాలల దినోత్సవంగా జరుపుకుంటోంది. నెహ్రూకు బాలలంటే ఎంతో ఇష్టం. దీంతో ఆయన మరణించిన తరువాత ఆయన పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

దేశానికి మొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలు అనితర సాధ్యం. దేశ పురోగమనంలో ఆయన పాత్ర కీలకం. ఎన్నో పథకాలు చేపట్టి దేశాభివృద్ధిలో ఆయన ఘనత చూపారు. అందుకే ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా చేసుకున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా బాలలను పలకరించి వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆయనకు గులాబీ పువ్వులంటే ఇష్టం కావడంతో పిల్లలు పూలు ఇచ్చి పలకరించేవారు. దీంతో ఆయన కూడా వారితో మాట్లాడేందుకు ఎంతో ఉత్సాహం చూపేవారు. దీంతో నెహ్రూకు బాలలంటే ఉన్న మక్కువతోనే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహించేందుకు ముందుకొచ్చింది.

1964లో నెహ్రూ మరణించిన తరువాత నుంచి ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకునేందుకు సంకల్పించింది. ఈ రోజు పిల్లలు స్కూళ్లలో సందడి చేస్తారు. పిల్లలే ఉపాధ్యాయులుగా మారి పిల్లలకు బోధన చేయడం వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్ద తరగతుల పిల్లలు చిన్న తరగతులకు ఉపాధ్యాయులుగా వచ్చి వారికి పాఠం బోధించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అన్ని పాఠశాలలు ఈ వేడుకను ఎంతో వైభవంగా నిర్వహిస్తాయి. బాలల దినోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతాయి.

ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్ని చిల్డ్రన్స్ డేను నవంబర్ 20న జరుపుకుంటాయి. ఒక్క భారతదేశం మాత్రం దీన్ని ముందుగానే జరుపుకుంటోంది. మనదేశం మన మొదటి ప్రధాని జన్మదినాన్ని బాలల దినోత్సవంగా చేసుకుంది. అందుకే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా చేసుకుంది. దీంతోనే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలతో సంబంధం లేకుండా మనం ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నాం. బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. నవంబర్ 14 పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version