Happy birth day Kamal Hasan : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. ఇక అలాంటి నటులు ఎలాంటి పాత్రను పోషించినా కూడా జనాలు చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ కేటగిరీకి చెందిన నటుడే కమల్ హాసన్…ఇక ఇలాంటి క్రమంలోనే కమల్ హాసన్ లాంటి నటుడు చేసే వైవిధ్యమైన పాత్రలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు అనే దాని మీదనే ప్రతి ఒక్కరూ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక 1954 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన జన్మించిన కమలహాసన్ తన అరోవ ఏటనే యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ‘కలతూరు కన్నమ్మ’ అనే సినిమాతో మొదటిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డుని అందుకున్నాడు… ఇక అప్పటీ నుంచి ఆయనలో నటన ప్రతిభ అనేది ఉండడం వల్లే ఆయన ఇంతటి ఘన కీర్తిని సంపాదించుకున్నాడు అంటూ అందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారు.
మొత్తానికైతే ఆయన ‘అపూర్వ రగంగాల్’ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకున్న హీరోగా చరిత్రలో నిలిచిపోయాడు. నిజానికి కమల్ హాసన్ ఇప్పటివరకు 240 కి పైగా సినిమాల్లో నటించాడు. వాటన్నింటిలో కూడా తన పాత్రకి ప్రాధాన్యం ఉంటేనే నటిస్తూ ఆ పాత్రకే తను ప్రాణం పోస్తూ వచ్చాడనే చెప్పాలి.
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించడంలో కమల్ హాసన్ సిద్ధహస్తుడు. ఇక ఈ సంవత్సరం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో విలన్ గా నటించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక కల్కి 2 లో ఈయన పాత్ర చాలా ఎక్కువగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈయన చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. శుభ సంకల్పం, సాగర సంగమం, స్వాతిముత్యం, నాయకుడు, భారతీయుడు, దశావతారం, విశ్వరూపం, విక్రమ్ లాంటి సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు.
ఇక ఇప్పటికీ కూడా నటనలో ఆయనతో పాటు పోటీ పడే నటులు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో ‘తుగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక రెండు సంవత్సరాల క్రిందట లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
ఇక దానికోసమే ‘తుగ్ లైఫ్ ‘ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇక ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులోకి అడుగుపెడుతున్న కూడా ఆయన ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలోకి సైతం పోటీని ఇస్తూ ఒక డిఫరెంట్ స్టైల్ ను ఏర్పాటు చేసుకొని నటిస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు…
నటన అనే పదానికే ఒక గుర్తింపు తెచ్చిన కమల్ హాసన్ లాంటి నటుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మనకు ఇంకొకరు కనిపించరు. ఇక ఆయన ను బీట్ చేసే నటులు ఇక ముందు కూడా ఎవరు రారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇప్పుడున్న దర్శకులందరూ ఆయనతో ఒక సినిమా చేస్తే చాలు అంటూ అదే డ్రీమ్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. మరి అందులో ఎవరెవరికి ఆ అవకాశం వస్తుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైన కూడా ఈ రోజు కమల్ హాసన్ గారి బర్త్ డే సందర్భంగా ఆయన కలకాలం హ్యాపీ గా ఉండాలని అలాగే ఇంక మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటైర్ టైన్ చేయాలని కోరుకుందాం…