Child : చిన్నతనంలో స్వీట్లు, చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే వృద్ధాప్యంలో మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి జరగకపోయినా, లేదా ఈ హార్మోన్ సరిగ్గా పని చేయకపోయినా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తద్వారా డయాబెటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
మధుమేహం రెండు రకాలు అందులో మొదటిది, టైప్ 1 డయాబెటిస్ గా చెబుతుంటారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను నాశనం చేస్తుంది అంటున్నారు నిపుణులు.
ఇక రెండవది టైప్ 2 డయాబెటిస్: ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం – చెడు జీవనశైలి వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది. భారతదేశంలో టైప్-2 మధుమేహంతో చాలా మంది బాధ పడుతున్నారు.
పరిశోధన: ఇటీవల నేచురల్ జర్నల్‌లో ఒక పరిశోధనను ప్రచురించారు. బాల్యంలో తక్కువ చక్కెర తీసుకోవాలి. దీని వల్ల వృద్ధాప్యంలో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. అయితే బాల్యంలో చక్కెర తీసుకోవడం తగ్గించాలి. దీనికి బదులు పిల్లలకు పౌష్టికాహారం ఇస్తే, జీవక్రియపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. తద్వారా శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
చిన్నతనం నుంచి చక్కెర ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఇన్సులిన్ పనితీరు క్షీణించి, మధుమేహం సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్నతనంలో స్వీట్లు తక్కువగా తినాలి. దీనివల్ల యుక్తవయస్సులో మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది.
మధుమేహాన్ని ఎలా నివారించాలి..
రోజువారీ వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. చక్కెర – మిఠాయిలకు కాస్త దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.
మధుమేహం హెచ్చరిక సంకేతాలు కూడా తెలుసుకోండి. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, భారీగా బరువు తగ్గడం, ఆకలి పెరగడం, అలసట, దృష్టిలోపం, పుండ్లు నయం కాకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, జలదరింపు లేదా తిమ్మిరి, చర్మంపై మచ్చలు వంటి లక్షణాలు ఉంటే మీకు మధుమేహం వచ్చిందని అర్థం.