Ready To Eat Food Market: మనిషి బిజీ లైఫ్.. సుఖ జీవనాన్నికి అలవాటు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయం కూడా ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. ఫలితగా రెండీ ఫుడ్ ఇండస్త్రీ గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో దీనివాటా 18.33 శాతంగా ఉంది. ఇది 2026 వరకు ఈ రెడీ టూ ఈట్ ఫుట్ మార్కెట్ 75 కోట్ల డాటర్లకు చేరుకుంటుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తోంది. ఫలితంగా ఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని పేర్కొంటున్నారు. ఇంతలా పెరగడానికి అనేక కారణాలు చెబుతున్నారు.

సమయాభావం..
ఆధునిక జీవన విధానంలో భార్య, భర్తలు ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో పాతకాలంటా ఇంట్లో వంట చేసే సమయం దొరకడం లేదు. పిండి పదార్థాలు ఇళ్లలో రడి చేయడానికి సమయం కేటాయించే వీలు కుదరడం లేదు. ఫలితంగా ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాలు రెడీ ఫుడ్‌పై ఆసక్తి చూపుతున్నారు.
చిన్న కుటుంబాలు..
పెరుగుతున్న చిన్ని కుటుంబాలు కూడా రెడీ టూ ఈట్ ఫుడ్‌కు మార్కెట్ గ్రోత్‌కు కారణమవుతన్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. దీంతో భార్య భర్తలు ఉద్యోగం, వ్యాపారం చేసినా ఇంట్లో ఉన్న అమ్మ లేదా అత్త అమ్మమ్మ నానమ్మ వంటలు తయారు చేసేవారు. పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్న వారు చిన్న కుటుంబాలుగా ఏర్పడుతున్నారు. వీరు కూడా రెడీ టూ ఈట్ ఫుడ్ కొనుగోలు చేస్తున్నారు.
మార్కెట్‌లో రెడీగా మిక్స్ ఐటమ్స్..
ఇక చిన్న కుటుంబాలు ఎక్కువగా కష్టపడకుండా.. ఇంట్లో పిండి రుబ్బడం, పప్పులు నానబెట్టడం, పులిహోర తయారీకి నిమ్మకాయలు, మామిడిడికాయలు రడీ చేసుకోవడం లాంటి పనిలేకుండా కొన్ని కంపెనీలు రెడీ మిక్స్‌లు మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఇవి న్యూక్లియర్ కుటుంబాలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో కష్టపడకుండా రెడీ మిక్స్‌లు అందుబాటులోకి రావడంతో చాలామంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. రెడీ మిక్స్ ఇంటికి తెచ్చుకుని వేడివేడిగా వండుకుని తింటున్నారు. ఇప్పీ, మ్యాగీ మార్కెట్‌లా రెడీ మిక్స్ మార్కెట్ కూడా క్రమంగా పెరుగుతోంది.
ఎంజాయ్‌మెంట్‌లో భాగంగా..
ఇక మారుతున్న జీవన విధానం, నగరీకరణ నేపథ్యంలో లైఫ్ ఎంజాయ్‌మెంట్‌కు అందరిలో ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగం తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కులు, సినిమాలకు వెళ్తున్నారు. అక్కడే రెడీగా ఉన్న ఫుడ్ తిని రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఇంట్లో వంటచేసే పని ఉండడంలేదు.

గతంలో విద్యార్థులు, నిరుద్యోగులే..
గతంలో విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే రెడీ ఫుడ్ తీసుకునేవారు. సింగిల్ రూంలలో అద్దెకు ఉంటూ 5 కేజీ సిలిండర్ సౌ లేదా ఎలక్ట్రిక్ హీటర్‌పై త్వరగా వంట చేయడానికి అన్నం వండుకుని కర్రీలు బయట లె చ్చుకుంటారు. ఇప్పుడు ఫ్యామిలీలు కూడా ఇదే కల్చర్‌కు అలవాటవుతున్నాయి.
పెరుగుతున్న ఫాస్ట్ ఫుడ్, రెడీ ఫుడ్ స్టాల్స్..
తయారీగా ఉన్న ఆహారం తీసుకునేవారి సంఖ్య పెరుగుతుండడంతో చాలామంది ఈ వ్యాపారంపై దృష్టిపెడుతున్నారు. కార్పొరేట్ సంస్థలు కూడా ఈరంగంలోకి అడుగుపెడుతున్నాయి. రెడీ ఫుడ్‌ను వేడివేడిగా ఆర్టర్‌పై సప్లయ్ చేస్తున్నాయి. ఇక నగరాలు, పట్టణాల్లో గల్లీకో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. లంచ్, డిన్నర్ టైంలో ఇవి కొనుగోలుదారులతో కిటకిటాడుతున్నాయి. దీంతో స్వయం ఉపాధి కోసం చూస్తున్నవారు ఈరంగాన్ని ఎంచుకుంటున్నారు.