spot_img
Homeఎంటర్టైన్మెంట్Rahil Anil Barve Man Pishach Budget: 33 వేలతో సినిమా ఎలా తీశావ్ సామీ......

Rahil Anil Barve Man Pishach Budget: 33 వేలతో సినిమా ఎలా తీశావ్ సామీ… నువ్వు దేవుడివయ్యా..

Rahil Anil Barve Man Pishach Budget: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది విజువల్ వండర్స్ ని తెరకెక్కిస్తున్నారు. కానీ ఇలాంటి క్రమంలోనే ఎక్కువ బడ్జెట్ తో కాదు తక్కువ బడ్జెట్ లో కూడా సినిమాని తీయవచ్చు అని ప్రూవ్ చేసిన దర్శకులు సైతం ఉన్నారు. ఇక ఈ కోవకు చెందిన దర్శకుడే ‘రాహి అనిల్ భార్వి’ ఆయన ప్రస్తుతం ‘మన్ పిశాచ్’ అనే మూవీని కేవలం 33 వేల రూపాయలతో చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇంతకుముందు ఆయన ‘తుంబాడ్’ అనే సినిమాతో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. అలాంటి దర్శకుడు కేవలం 33 వేలతో సినిమాని ఎలా చేశాడు అనే విషయాలను అనిల్ ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఇక ఆ విశేషాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

అనిల్ ఈ సినిమా కథని చాలా బ్రీఫ్ గా రాసుకున్నారట. ఇక దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో సినిమాని ఎలా చేయొచ్చు అనే ఒక గైడెన్స్ ని క్రియేట్ చేసుకొని స్క్రిప్టు కేవలం 60 పేజీలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. మేకింగ్ విషయంలో కూడా ఆయన ఎక్కువగా డబ్బులను ఖర్చు చేయకుండా చేతితోనే కొన్ని బొమ్మలను గీసి దానికి స్టొరీ బోర్డు రూపంలో ఏర్పాటు చేసి ఐ ఫోన్ తో తీసిన వీడియోలను, ఫోటోషాప్ ఏఐ ద్వారా జనరేట్ చేశారట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ద్వారా కొన్ని విజువల్స్ ని వాడుకొని మొత్తానికైతే సినిమాని పూర్తి చేశారు…

కథేంటంటే…

హడమ్ గావ్ అనే ఉరికి ఒకరోజు పురావస్తు శాఖకు చెందిన ఆఫీసర్ సదాశివరావు వెళ్తారు. కొండల్లో నుంచి బయటపడ్డ గుమ్మటం యొక్క రహస్యాన్ని తెలుసుకునేందుకు ఆయన తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. అందులో భాగంగానే ఆ ఊర్లోనే ఉంటున్న సావిత్రి అనే ఒక అమ్మాయి ఇంట్లో ఉంటాడు. ఆయనకి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది…

ఈ సినిమాని కేవలం 33 వేలల్లో తీశాడు అంటే ఎవరు నమ్మడం లేదు. కానీ దర్శకుడు స్వయంగా చెప్పడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ‘మన్ పిశాచ్’ సినిమాని మార్చి 18వ తేదీన యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

80 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దర్శకుల దగ్గర బడ్జెట్ లేకపోయిన కూడా దమ్ముంటే తక్కువ బడ్జెట్ లో కూడా సినిమాను చేయొచ్చు అనే ఒక మెసేజ్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అనిల్ ఈ సినిమాని చేశారట…

 

MANN-PISHACH film trailer 4K  #MannPishach #RahiAnilBarve #AIFilmExperiment #ZeroBudgetFilm

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version