Groom Feet Washing : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడు అతనికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. తన జీవితంలో కొత్త అమ్మాయితో పాటు కొత్త బంధువులు రావడం ప్రారంభమవుతుంది. అయితే పెళ్లి సమయంలో వరుడు అన్ని రకాలుగా ఆతిథ్యాన్ని పొందుతాడు. అంతేకాకుండా అమ్మాయి తరఫున బంధువుల నుంచి అతిపెద్ద గౌరవాన్ని పొందుతాడు. అలాగే పెళ్లిళ్ల సమయంలో వరుడుని గౌరవిస్తూ అతడికి ఏమి కావాలో తెలుసుకుంటూ మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే సమయంలో పెళ్లి తంతు కార్యక్రమంలో భాగంగా అతని కాళ్లు కడిగి ఆ నీళ్లను వధువు తండ్రి నెత్తిపై వేసుకుంటాడు. వరుడు కంటే పెద్దవాడైనా ఆ వ్యక్తి ఇలా నీళ్లు కడిగి వేసుకోవడానికి గల కారణం ఏంటి?
Also Read : ఇంట్లోనే సన్‌స్క్రీన్ తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే?
పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. ఒకసారి పెళ్లి అయిన తర్వాత తన భాగస్వామితో జీవితాంతం కలిసి మెలిసి ఉండాలని పెళ్లి జరిగే సమయంలో మంత్రాల ద్వారా పురోహితులు చెబుతూ ఉంటారు. హోమగుండం కాల్చి ఏడు అడుగులు దాని చుట్టూ నడుస్తూ.. ఏడు జన్మల పాటు కలిసి ఉండాలని కోరుతారు. అయితే ఇదే సమయంలో వధువును, వరుడుని అందంగా అలంకరించి వారికి పెళ్లి చేస్తారు. ఈ పెళ్లి సమయంలో వధువు తండ్రి పెళ్ళికొడుకు కాళ్ళను కడిగి ఆ నీళ్లను నెత్తిపై చల్లుకుంటాడు.
.’సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ పారాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యామ్’అనే మంత్రాన్ని ఈ వివాహ సమయంలో చదువుతారు. అంటే పెళ్లి సమయంలో వరుడుని శ్రీ లక్ష్మీ నారాయణ స్వరూపుడిగా భావిస్తారు. అలాగే వధువును లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే వీరిద్దరిని అందంగా అలంకరిస్తారు. అయితే శ్రీమన్నారాయణ పాదాలను గంగ తాకుతుంది అని పురాణంలో ఉంది. అందువల్ల పెళ్లి కుమారుడిని కాళ్ళను తాకిన నీళ్లు గంగలా మారుతాయి. అరె గంగానీళ్లను నెత్తిపై చల్లుకుంటారని చెబుతున్నారు. పెళ్లి కుమారుడి వద్ద గంగా రాలేదు కాబట్టి శుభ్రమైన నీటితో పెళ్లి కుమారుడి కాళ్ళను కడిగి ఆ నీళ్లను గంగవలే భావిస్తారు. అందుకే పెళ్లి సమయంలో పెళ్లి కుమారుడి కాళ్లు కడుగుతూ ఉంటారు.
అయితే తనకంటే వయసు చిన్నవాడు అయినా పెళ్లి కుమారుడి కాళ్ళను కడగడం వల్ల తనకు ఎంతో పుణ్యం వస్తుందని చెబుతూ ఉంటారు. కన్యాదానం చేయడం వల్ల ఎన్నో రకాలుగా పుణ్యాలు పొందుతారు. అందులో భాగంగా అనే పెళ్లి కుమారుడిని దేవుడిలా భావించి అతడికి మర్యాదలు చేయడం వల్ల ఆ స్వామి సంతోషిస్తాడని అంటారు. అందువల్ల పెళ్లిళ్ల సమయంలో కొత్త అల్లుళ్లకు మామలు గౌరవం ఇస్తూ ఉంటారు. పెళ్లయిన తర్వాత కూడా వారిని గౌరవంగానే చూసుకుంటూ మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక పెళ్లికూతురు లక్ష్మీదేవితో భావిస్తూ ఆమెను కంటతడి పెట్టకుండా చూసుకుంటారు. అలాగే ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో తమ ఇంటి దేవత వెళ్ళిపోతుందని బాధపడుతూ ఉంటారు.