AI Health Assistant: ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కృత్రిమ మేధస్సు.. పేరు ఏదైనా దీనిని సృష్టించింది మనషే. కానీ ఇది ఇప్పుడు మనిషికే సవాల్ విసురుతోంది. మనిషినే గైడ్ చేస్తుంది. ఇప్పటికే అనేకరంగాల్లోకి ప్రవేశించిన ఏఐ.. ఇప్పుడు వైద్యరంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. దానిని సృష్టించిన మనిషికే కోచ్‌గా వ్యవహరిస్తోంది. స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ రింగ్‌లు వంటి వేరబుల్ డివైస్‌లు ఇప్పుడు మన జీవనశైలిని పరివర్తన చేస్తున్నాయి. ఈ డివైస్‌లు నిత్యం సేకరించే డేటా అడుగుల సంఖ్య, నిద్ర సమయం, హృదయ స్పందన రేటు, నిద్ర నాణ్యత స్కోరు వంటివి కేవలం సంఖ్యలుగా కనిపించినా, వాటి వెనుక దాగిన సమాచారం మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలం. తాజాగా గూగుల్ తాజాగా అభివృద్ధి చేసిన ‘పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్)’ ఈ డేటాను విశ్లేషించి, వ్యక్తిగత ఆరోగ్య సలహాలు అందించే ఒక వినూత్న ఏఐ వ్యవస్థ ఇది.
Also Read: డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ అర్థం కావడం లేదా? అయితే వాట్సాప్ లో ఇలా చేయండి..
వేరబుల్ డేటా విశ్లేషణ..
పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్, గూగుల్ యొక్క జెమినై మోడల్ ఆధారంగా రూపొందించబడిన ఒక ఫైన్–ట్యూన్డ్ ఏఐ వ్యవస్థ, వేరబుల్ డివైస్‌ల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ వ్యవస్థ హృదయ స్పందన రేటు, నిద్ర నమూనాలు, శారీరక శ్రమ, శ్వాస రేటు వంటి డేటాను సమీక్షించి, వ్యక్తిగత ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా సూచనలు అందిస్తుంది. నిద్ర నాణ్యత తగ్గినప్పుడు, ఈ ఏఐ స్క్రీన్ టైమ్‌ను తగ్గించమని, ఆహారంలో మార్పులు చేయమని లేదా రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోమని సలహా ఇస్తుంది.. 857 రియల్–వరల్డ్ కేసులను విశ్లేషించిన ఫలితాల ప్రకారం, పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్ నిద్ర సంబంధిత ప్రశ్నలకు 79%, ఫిట్‌నెస్ సంబంధిత ప్రశ్నలకు 88% ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చింది, ఇది నిపుణుల స్థాయిని సమానంగా లేదా అధిగమించింది.
శాస్త్రీయ కచ్చితత్వం..
గూగుల్ ఈ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు 857 కేసులను ఆధారంగా చేసుకొని, నిద్ర, ఫిట్‌నెస్ రంగాల్లో నిపుణులతో కలిసి పనిచేసింది. ఈ కేసుల్లో వేరబుల్ డివైస్‌ల నుంచి సేకరించిన 29 రోజుల నిద్ర డేటా, 30 రోజుల ఫిట్‌నెస్ డేటా, వయసు, లింగం వంటి డెమోగ్రాఫిక్ సమాచారం ఉన్నాయి. పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్, నిద్ర వైద్యం, ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ పరీక్షల్లో నిపుణుల సగటు స్కోరు (76% నిద్ర, 71% ఫిట్‌నెస్) కంటే ఎక్కువ స్కోరు (79% నిద్ర, 88% ఫిట్‌నెస్) సాధించింది. హృదయ స్పందన రేటు విశ్లేషణలో 76% కచ్చితత్వంతో, ఈ మోడల్ రియల్–టైమ్ డేటాను సమర్థవంతంగా విశ్లేషించి, వినియోగదారులకు ఆచరణీయ సలహాలు అందించగలదని నిరూపించింది. పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్ యొక్క సామర్థ్యాలు ఆకట్టుకున్నప్పటికీ, దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు ఈ ఏఐ సలహాలను కేవలం సూచనలుగానే పరిగణించాలని, వైద్య సలహాగా భావించరాదని హెచ్చరిస్తున్నారు.
చరిత్ర ఆధారంగా లోతైన విశ్లేషణ
పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది రియల్–టైమ్ డేటాతోపాటు వినియోగదారుల ఆరోగ్య చరిత్రను కూడా విశ్లేషిస్తుంది. దీని ద్వారా గత నమూనాలను పరిగణనలోకి తీసుకొని మరింత కచ్చితమైన సూచనలు అందిస్తుంది. ఒక వ్యక్తి యొక్క నిద్ర నమూనాలు గత 30 రోజుల్లో మారినట్లు గుర్తిస్తే, ఈ ఏఐ ఆ మార్పులకు కారణాలను విశ్లేషించి, జీవనశైలిలో సరైన సవరణలు సూచిస్తుంది. ఈ సామర్థ్యం వల్ల పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్ ఒక వ్యక్తిగత ఆరోగ్య సలహాదారుగా పనిచేస్తుంది, ఇది సంప్రదాయ ఫిట్‌నెస్ ట్రాకర్లను మించిన సాంకేతికతగా నిలుస్తుంది.
Also Read: ప్రతీ నగరంలో కనిపించే ‘ర్యాపిడో’ను తెచ్చింది తెలుగు కుర్రాడే.. ఎవరో తెలుసా?
పీహెచ్‌ఎల్‌ఎల్‌ఎమ్ అభివృద్ధి ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఈ ఏఐ వ్యవస్థ భవిష్యత్తులో వైద్య రికార్డులు, పోషకాహార డేటా, మానసిక ఆరోగ్య సమాచారం వంటి విస్తృత డేటాను విశ్లేషించగల సామర్థ్యం కలిగి ఉంటుందని గూగుల్ పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే, ఈ సాంకేతికతను సురక్షితంగా, నీతిపరంగా అమలు చేయడానికి డేటా గోప్యత, అల్గారిథమ్‌లలో పక్షపాతం నివారణ, నిరంతర నాణ్యత పరీక్షలు అవసరం.