Illegal Gambling Arrests: ఏపీ పోలీసులు( AP Police) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేసులను ఛేదించడంలో టెక్నాలజీని వాడుకుంటున్నారు. ముఖ్యంగా డ్రోన్ల సహకారంతో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి సహా పలు నేరాలను అరికట్టడానికి పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. డ్రోన్లతో నేరాలు సైతం తగ్గుముఖం పడుతుండడం విశేషం. తాజాగా చిత్తూరు జిల్లాలో పోలీసులు డ్రోన్ల సాయంతో అంతర్ జిల్లా జూద ముఠా ఆట కట్టించారు. పొదల్లో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ల సాయంతో పట్టుకున్నారు. వారి నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: నెల్లూరు డాన్ అరుణ మీద 160 కంప్లైంట్లు.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆమె మనుషులు..
పేకాటరాయుళ్ల అరెస్ట్..
చిత్తూరు జిల్లా( Chittoor district) ముసలి పేడు పొలాల్లో గుంపుగా కొంతమంది పేకాట ఆడుతున్నారు. దీనిపై సమాచారం రావడంతో పదిమంది పోలీసులు డ్రోన్ల సాయంతో వెతుకులాట ప్రారంభించారు. ఓ పొలం సమీపంలోని పొదల్లో ఎవరికీ కనిపించకుండా వారు పేకాట ఆడుతున్నారు. ఆ లోపలికి వెళ్లిన డ్రోన్.. అక్కడ పదుల సంఖ్యలో మనుషులు పేకాట ఆడుతున్నట్లు గుర్తించింది. పోలీసులకు సమాచారం రావడంతో ఆ పొదల్లోకి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తిరుపతికి చెందిన ఇద్దరు, కడప జిల్లాకు చెందిన ఐదుగురు, రాజంపేటకు చెందిన ఇద్దరు, మరో ఇద్దరు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,36,740 నగదు తో పాటు 12 సెల్ ఫోన్లు, నాలుగు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మరో 9 మంది పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు.
కూటమి వచ్చిన తరువాతనే..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల చేతికి డ్రోన్ వచ్చింది. డ్రోన్ టెక్నాలజీని వాడుకొని నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పోలీసులు అరికడుతున్నారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిఘా పెంచారు. దొంగతనాలు, గంజాయి వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలను డ్రోన్ల ద్వారా గుర్తిస్తున్నారు. డ్రోన్ల సాయంతో పోలీసులు నేరాలను నియంత్రిస్తున్నారు. ఊరికి దూరంగా ఉండే ఖాళీ స్థలాలు, శిధిల భవనాల్లో గంజాయి తాగుతున్న వారిని పట్టుకుంటున్నారు. బహిరంగంగా మద్యం తాగే వారిని, అసాంఘిక శక్తులు గుమిగూ డే ప్రాంతాలను సైతం గుర్తించి వేగంగా అక్కడకు చేరుకుంటున్నారు. వారిని అదుపులోకి తీసుకోగలుగుతున్నారు.
Also Read: ఎమ్మెల్యేను లేపేస్తాం.. ఎంపీ ఇంటికొచ్చి మరీ లేఖ!
అలా పెరిగిన వినియోగం..
విశాఖ జిల్లాలో( Visakha district ) మన్య ప్రాంతంలో విపరీతంగా గంజాయి సాగు అవుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడుతున్న దాని మూలాలు విశాఖను చూపిస్తున్నాయి. దీంతో డ్రోన్ల సాయంతో గంజాయి సాగుపై దృష్టి పెట్టారు పోలీసులు. మన్య ప్రాంతంలో గంజాయి సాగుతున్న ప్రాంతాలను గుర్తించి దహనం చేస్తున్నారు. అప్పటినుంచి పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రధాన పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే డ్రోన్లు అందించారు. మిగతా పోలీస్ స్టేషన్లకు సైతం అందించనున్నారు. జాతరలతో పాటు పండగ సమయాల్లో కూడా డ్రోన్లు ఎగురవేసి నిరంతర నిఘ పెడుతున్నారు. కోడిపందాలు, జూద మాటలు లేకుండా నియంత్రిస్తున్నారు.