Rapido Founder Pavan Guntupalli: ప్రతి ఒక్కరూ తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. కానీ అందమైన జీవితం వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ఆ కష్టాన్ని దాటాలంటే ఎంతో ఓర్పు, ప్రణాళిక, సమయస్పూర్తి వంటివి అలవరుచుకోవాలి. ఈ లక్షణాలు కొంతమందిలో మాత్రమే ఉంటారు. అందుకే వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఒక సక్సెస్ ను పొందాలంటే కొందరికి షార్ట్ టైంలోనే సాధ్యంకావొచ్చు. మరికొందరికి సమయం ఎక్కువగా పట్టొచ్చు. కానీ ఆ సమయం వచ్చేదాక వెయిట్ చేయడమే అసలైన కృషి. ఇలాంటి కృషి చేసిన తెలంగాణ యువకుడు ఇప్పుడు కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందడమే కాకుండా.. ఎంతో మందికి సేవ అత్యవసర సేవలను అందించగలుగుతున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగులు, విద్యార్థులు ఒక చోట నుంచి మరోచోట ప్రయాణం చేయాలంటే వినిపించే మాట ‘రాపిడో’. మరి ఈ ర్యాపిడో వెలుగులోకి రావడానికి ఓ తెలుగు కుర్రాడు అని కొద్దిమందికే తెలుసు. అతడు దీనిని వెలుగులోకి తీసుకురావడానికి చేసిన కృషి, పట్టుదల గురించి తెలిస్తే మీరూ అతని ఫాలో కావొచ్చు. మరి ఆయన గురించి తెలుసుకోవాలని ఉందా?
ప్రస్తుత కాలంలో ఉద్యోగానికి సెక్యూరిటీ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నవారు సొంతంగా ఏదైనా స్టార్టప్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే గతంలోనే పవన్ గుంటుపల్లి అనే యువకుడికి ఈ ఆలోచన వచ్చింది. ఈయన కంప్యూటర్ ప్రోగ్రామింగ్, స్టాక్ ట్రేడింగ్ లో అనుభవం పొందాడు. ఈ సమయంలో ఓలా, ఉబేర్ క్యాబ్ లు మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇవి కేవలం 4 వీలర్స్ మాత్రమే. ఇదే సేవలను టూవీలర్స్ ద్వారా అందిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. అంతేకాకుండా ఒక్కరూ ప్రయాణించాలంటే టూ వీలర్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని అనుకున్నారు. దీంతో పవన్ గుంటుపల్లి తన మిత్రులతో కలిసి ‘ర్యాపిడో’ను అందుబాటులోకి తెచ్చారు.
Also Read: శాస్త్రీయ ఆధారాలతో మహాభారత యుద్ధ కాలం తెలిసింది
2015లో దీనిని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కావాల్సిన నిధులు లేవు. నిధులను సమీకరించడానికి పలు సంస్థల వద్దకు ఈ ప్రతిపాదనలతో వెళ్లారు. కానీ చాలా సంస్థలు ఒప్పుకోలేదు. అప్పటికే ఓలా, ఉబర్ కంపెనీలు ఆదరణ పొందడంతో వాటి ముందు ఇవి నిలబడదా? అని అన్నవారు కూడా ఉన్నారు. చివరికి హీరో మోటో కార్పొ చైర్మన్ పవన్ ముంజాల్ మాత్రం పవన్ గ్రూప్ చేసిన ప్రతిపాదనలను ఒప్పుకున్నారు. దీంతో 2016లో 400 బైక్ లతో ర్యాపిడో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల్లో సేవలు ప్రారంభించారు. 2016 జనవరిలో ర్యాపిడోను 5 వేల మంది బుక్ చేసుకున్నారు. డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 1.5లక్షలకు చేరింది.
సాధారణంగా ఓలా, ఉబర్ క్యాబ్ ను బుక్ చేసుకుంటే వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కానీ ర్యాపిడో బైక్ మినిమం ఛార్జ్ రూ.15 నుంచి ప్రారంభించారు. దూరాన్ని భట్టి ఛార్జి నిర్ణయిస్తారు. ఈ విధానం ఉద్యోగులకు, విద్యార్థులకు బాగా నచ్చింది. దీంతో చాలా మంది ర్యాపిడోను బుక్ చేసుకుంటున్నారు. అయితే కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఈ సేవలు ప్రారంభయ్యాయి. మొత్తంగా 100కు పైగా నగరాల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఈ యాప్ ను ఇప్పటి వరకు 5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. కంపెనీ వ్యాలూ ప్రస్తుతం రూ.9,350 కోట్లకు చేరింది. కొందరు అదనపు ఆదాయం కోసం ర్యాపిడోలో ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఇలా ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా.. విజయం సాధించేవరకు శ్రమించకూడదన్న విషయం పవన్ గుంటుపల్లి మిత్రబృందం ద్వారా తెలుస్తోంది.