Google Play Store: టెక్నాలజీ యుగంలో అప్లికేషన్లదే హవా. మనం పీల్చే గాలి నుంచి… తినే తిండి దాకా అన్నీ అవే నిర్దేశిస్తున్నాయి. వీటి ఆధారంగానే లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. లక్షలాదిమందికి ఉపాధి లభిస్తుంది. కొత్త కొత్త అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. మంచి వెనకే చెడు ఉన్నట్టు.. ఈ అప్లికేషన్ల వెనుక కూడా మాల్వేరు ముప్పు పొంచి ఉంది. అందువల్లే ఏటా సైబర్ క్రైమ్ మోసాల వల్ల వందల కోట్ల వినియోగదారుల సొమ్ము నేరగాళ్ల ఖాతాలో చేరుతోంది.. ఇక ఎంతటి పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రూపంలో మాల్వేర్ వివిధ యాప్ లోకి ప్రవేశిస్తుంది. మనదేశంలో ఉన్నత శ్రేణి, ఎగువ మధ్యతరగతి శ్రేణి మినహా మిగతావాళ్లంతా ఆండ్రాయిడ్ ఫోన్లనే వాడుతూ ఉంటారు. ఈ ఫోన్లల్లో అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏకైక మార్గం గూగుల్ ప్లే స్టోర్. అయితే ఇటీవల మాల్వేర్ బెడద భారీగా పెరిగిపోవడంతో గూగుల్ ప్లే స్టోర్ 20 లక్షల నుంచి డౌన్లోడ్స్ కలిగిన 13 యాప్ లను తొలగించింది. దీనిని బట్టి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లలో ఉన్న మాల్వేర్ ఆండ్రాయిడ్ డివైస్ లోని బ్యాటరీలను కూడా తినేస్తున్నాయి. బ్యాటరీ డ్రెయిన్ సాధారణం కంటే వేగంగా ఈ మాల్వేర్ లో జరుగుతోంది. 13 యాప్స్ లో మలాసియస్ కోడ్ ను మెకాపి మొబైల్ రీసెర్చ్ టీం గుర్తించింది.. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి వీటిని తొలగించింది.

ఆ యాప్స్ ఇవే
హై స్పీడ్ కెమెరా.. ఈ యాప్ మల్టిపుల్ పిక్చర్స్ ని హై స్పీడ్ తో తీస్తుంది. స్పోర్ట్స్ కు సంబంధించి స్పష్టమైన ఫోటోలను క్లిక్ చేయగలదు.
స్మార్ట్ టాస్క్: యూసర్లు తమ పనిని చక్కగా నిర్వర్తించేందుకు ఇది తోడ్పడుతుంది. కష్టమైసబుల్ డాష్ బోర్డును అందిస్తుంది. దీంతోనే తమ పనులను యూజర్లు చక్కబెట్టుకోవచ్చు. చేస్తున్న పనిపై ట్రాకింగ్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఫ్లాష్ లైట్ ప్లస్: దీని ఇంటర్ పేస్ ను ఉపయోగించడం సులువు.. క్లీన్ గా కూడా ఉంటుంది. భద్రత కూడా కూడుకున్నది.. వ్యక్తిగత సమాచారాన్ని ఈ యాప్ అడగదు.
మెమో క్యాలెండర్: సింపుల్ క్యాలెండర్ నోట్ యాప్ ఇది. సింపుల్ నోట్స్ తీసుకొని, దాన్ని విభజించడమే కాదు.. వేరువేరు రంగులు కూడా ఇచ్చుకోవచ్చు.. నోట్స్ కు భద్రత కోసం పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
ఇంగ్లీష్ కొరియన్ డిక్షనరీ: ఇదో ప్యాకెట్ డిక్షనరీ.. లైన్ ఆఫ్ లైన్ కింద ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
బుసాన్ బస్: బుసాన్ లో బస్ రూట్లను తెలియజేసే యాప్ ఇది.
క్విక్ నోట్స్: నోట్ టేకింగ్ కు చాలా సులువుగా ఉపయోగపడే యాప్ ఇది.
స్మార్ట్ కరెన్సీ కన్వర్టర్: పేరుకు తగ్గట్టుగానే కరెన్సీ విలువను తెలియజేసే యాప్ ఇది.
జో య్ కోడ్: క్యూ ఆర్ కోడ్, బార్ కోడ్ రీడర్ వంటివి చాలా ఈ యాప్లో ఉన్నాయి.

ఎజ్ డి కా: టైం స్టాంప్ కెమెరా, డేట్ స్టాంప్ కెమెరా యాప్ ఇది.
ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడర్: సేవ్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలు, పోస్టులు, స్టోరీలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఏజ్ నోట్స్: అచ్చంగా నోట్స్ అవసరమైన వారికి ఉపయోగపడే ఆర్గనైజర్ ఇది. హ్యాండ్ ఫ్రీ నోట్స్ తీసుకునేందుకు తోడు పలు ఇతర ఫీచర్లు కూడా ఈ యాప్ లో ఉన్నాయి.
ఇమేజ్ వాల్ట్_ హైడ్ ఇమేజెస్: దీనిని ఉపయోగించి మీ ఇమేజెస్ ను దాచేయవచ్చు. ఈ ఫోటోలకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ యాప్స్ లో మాల్వేర్ ప్రవేశిస్తునడం.. యూజర్ల వ్యక్తిగత వివరాలను తస్కరిస్తున్న నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటిని తొలగించింది.