Tatkal ticket: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గడంతో భారతీయ రైల్వే సేవలను తిరిగి పూర్వపు స్థితికి తెచ్చింది. దేశంలో రోజురోజుకు రైలు ప్రయాణాలు చేసేవాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది చివరి నిమిషాల్లో రైలు టికెట్ ను బుక్ చేసుకోవాలంటే తత్కాల్ ఫీచర్ పై ఆధారపడుతున్నారు. అయితే తత్కాల్ టికెట్ ను పొందడం అంత తేలిక కాదనే సంగతి తెలిసిందే.
ప్రతిరోజూ ఏసీ కోచ్ లకు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ కోచ్ లకు ఉదయం 11 గంటలకు టికెట్ బుకింగ్స్ మొదలవుతాయి. ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్ ను బుకింగ్ చేసుకోవాలని భావించే వాళ్లకు ఫామ్ లలో వివరాలను నింపడం, క్యాప్చాను ఎంటర్ చేయడం సులువైన విషయం కాదు. ఈ వివరాలను నమోదు చేసి టికెట్ బుకింగ్ చేసే సమయానికి చాలామంది వెయిటింగ్ లిస్ట్ జాబితాలో ఉంటున్నారు.
ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ఒక స్పెషల్ ఫీచర్ సహాయంతో ఒకె స్పెషల్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా రైలు ప్రయాణం చేసేవాళ్ల వివరాలను ముందుగానే సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో తత్కాల్ టికెట్ ను బుకింగ్ చేసే సమయంలో క్లిక్ యాడ్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అడ్రస్ పై క్లిక్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
తత్కాల్ టికెట్లకు పేమెంట్ చేసే సమయంలో యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే సులభంగా టికెట్లు బుకింగ్ అవుతాయి. ఈ విధంగా తత్కాల్ టికెట్లను సులభంగా బుకింగ్ చేయడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసేవాళ్లకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.